iPhone 13: ఐఫోన్‌–13 డిస్కౌంట్‌ ఎంతో తెలుసా?

iPhone 13: ప్రస్తుతం మార్కెట్లోకి రోజుకొక కొత్త ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. కొత్త కొత్త ఫ్యూచర్లు, భిన్న విభిన్న లుక్స్‌తో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు ఆయా కంపెనీలో. ఓ కంపెనీ ఎక్కువ ఫ్యూచర్స్‌తో ఓ ఫోన్‌ విడుదల చేస్తే వారం లోపే మరో కంపెనీ దానికి మించిన ఫ్యూచర్లు జత చేసి విడుదల చేస్తున్నారు. ఇలా ఆయా కంపెనీలు పోటాపోటీగా వివిధ రకాలు ఫోన్లను తయారు చేస్తున్నారు.

అన్ని ఫోన్లకన్నా ఐఫోన్‌ అంటే అందరికీ ఇష్టమే. కానీ.. దాని ధర ఆకాశాన్ని అంటేలా ఉంది. అందుకు సామన్య ప్రజలు అటువైపు ఆసక్తి కనమర్చారు. అలాంటి ఫోన్‌ తక్కువ ధరకు వస్తోందంటే ఎగిరి గంతెస్తారు. అలాంటి మంచి అవకాశాన్ని ఫ్లిప్‌ కార్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్‌ ఆఫర్‌ ఎçప్పుడు వస్తోందో.. ఎంత ధర తగ్గుతోందోనని వేచి ఉంటున్న అలాంటి వారికోసం ఐఫోన్‌–13పై ఏకంగా రూ. 14 వేల డిస్కౌంట్‌ ఇవ్వనుంది. వచ్చేవారంలో ఐఫోన్‌–14 మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది.

అయితే.. ఐఫోన్‌–13 ధరకే ఐఫోన్‌–14 విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంల ఐఫోన్‌–13పై భారీ తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ. ఐఫోన్‌–13, 128జీబీ మోడల్‌పై రూ.14 వేల డిస్కౌంట్‌ అందిస్తోంది. దాని అసలు ధర రూ.79,900 అయితే.. రూ.65,999 ధరకే ఇవ్వనుంది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.1000 ఆఫర్‌ ఇస్తుండటంతో ఐఫోన్‌–13 రూ 64,999లకే వస్తోంది. పాత ఫోన్‌ను ఎక్సే్ఛంజ్‌ చేసేవారికి ఐఫోన్‌–13 మరింత తక్కువకే వస్తుంది. పాతన ఫోన్‌పై ఈ–కామర్స్‌ దిగ్గజం ఏకంగా రూ 19,000 వరకూ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఎక్సే్ఛంజ్‌ చేసే ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఎక్సే్ఛంజ్‌ విలువను లెక్క కడుతారు.

ఫ్యూచర్స్‌ ఇవే..

6.1 ఇంచెస్‌ డిస్‌ప్లే
12 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
4 కోర్‌ జీపీయూ
6 కోర్‌ సీపీయూ
5–జీ కనెక్టవిటీ సపోర్ట్‌
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
ఏ–15 బయోనిక్‌ చిప్‌సెట్‌
బ్యాక్‌సైడ్‌ డ్యూయల్‌ కెమెరా సెటప్‌( 12ఎంపీ +12ఎంపీ)

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -