Aindrila Sharma: చనిపోయిన నటి పాదాలకు ముద్దుపెట్టిన ప్రియుడు.. ఇంత ప్రేమా?

Aindrila Sharma: మనుషులు ఉన్నా, లేకున్నా కలకాలం ఉండేది ప్రేమ అంటారు. ప్రేమను పొందగలగడం గొప్పవరం. అలాంటి గొప్ప ప్రేమికులు దూరం కావడం అనేది ఎంతో బాధాకరం. చావు ఇలాంటి నిజమైన ప్రేమికులను దూరం చేయగా.. ఇలాంటి ప్రేమను చూసి దేవుడు ఓర్వలేకే చావు రూపంలో ఒకరిని దూరం చేశారని అందరూ అంటున్నారు.

 

బెంగాలి నటి ఆండ్రియా శర్మ, ప్రియుడు సవ్యసాచి చౌదరిలకు సంబంధించి ప్రతి ఒక్కరు తమ సానుభూతిని ప్రకటిస్తున్నారు. అయ్యో వీళ్లిద్దరికి ఇలా జరిగిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆండ్రియా శర్మ కేవలం 24 ఏళ్లలో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న యువ నటి. సినిమాలతో పాటు ఫోటోషూట్ లతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

 

ఆండ్రియా శర్మ, సవ్యసాచి చౌదరిలు ప్రేమలో ఉన్నారు. గతకొంతకాలంగా వీరు కలిసే ఉంటున్నారు. అయితే వీళ్ల ప్రేమను చూసిన దేవుడికి కోపం వచ్చిందేమో కానీ ఆండ్రియా శర్మను క్యాన్సర్ కమ్మేసింది. ఆ క్రమంలో క్యాన్సర్ మీద పోరాటం చేస్తుండగా.. నవంబర్ 20న ఎక్కువసార్లు గుండెపోటు రావడంతో ఆమె మరణించింది.

 

ఆండ్రియా అనారోగ్యం పాలైనా సవ్యసాచి ఆమె వెన్నంటే ఉన్నాడు. ఆమెకు తోడుగా నిలిచాడు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆండ్రియా కోమాలోకి వెళ్లినప్పుడు ఆమె ఆరోగ్యం బాగుండాలని అందరూ ప్రార్థించాలని సవ్యసాచి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు.

 

ఆండ్రియా ప్రాణాల కోసం పోరాడుతూ తన చివరి శ్వాసను విడిచింది. దీంతో ఒక్కసారిగా కూలిపోయిన సవ్యసాచి.. ఆమె శవం వద్ద ఎవరూ ఊహించని పని చేశాడు. ఆమె పాదాలను ముద్దు పెట్టుకొని రోధించాడు. ఇదంతా అక్కడ ఉన్న వాళ్లు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి నిజమైన ప్రేమికులను చావు విడదీసింది అని బాధపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -