Air Asia: విమానంలో వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్..రూ.1497కే విమాన టికెట్

Air Asia: చాలా మందికి విమానంలో ప్రయాణించాలని ఉంటుంది. ఆకాశంలో మబ్బుల చాటున అలా విమానంలో వెళ్తూ ఈ ప్రపంచాన్ని చూడాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ కోరిక తీరదు. విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకునేది. అందుకే సామాన్యులు విమానంలో ప్రయాణించలేరు. వారి వారి స్తోమతకు తగినట్లుగా బస్సులోనో, రైలులోనో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ అందింది.

 

ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్‌ఏషియా ఓ తీపికబురును చెప్పింది. కొత్త ఏడాది సందర్భంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా సామాన్యుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్‌ను తెచ్చింది. ఇంకో మూడు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో విమానయాన సంస్థలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి.

 

ఇండిగో దేశీయ విమాన ప్రయాణాన్ని రూ.2,023కు, అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని రూ.4,999లు ఆఫర్ చేస్తూ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అదేవిధంగా ఎయిర్‌ఏషియా సంస్థ కూడా నూతన సంవత్సరం సందర్భంగా బంపరాఫర్ ను తీసుకొచ్చింది. విమాన ప్రారంభ టిక్కెట్టు ధరను రూ.1,497గా నిర్ణయిస్తూ ప్రకటించింది. ఈ నెల 25వ తేది ఆ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

 

ఈ ప్రత్యేక ఆఫర్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు 2023 జనవరి 15వ తేది నుంచి ఏప్రిల్‌ 14వ తేది లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే సీట్లు తక్కువ సంఖ్యలోనే ఉండటంతో ఇది కేవలం లిమిటెడ్ ఇన్వెంటరీ ఆఫర్ అని ఆ సంస్థ తెలిపింది. ఈ బంపరాఫర్ ను పొందాలనుకునేవారు www.airasia.co.in వెబ్‌సైట్‌, కంపెనీ మొబైల్‌ యాప్‌ ద్వారా బుకింగ్ చేసుకుని విమానాల్లో ప్రయాణించవచ్చు. బెంగళూరు – కొచ్చి నగరాల మధ్య ఈ బంపర్ ఆఫర్ల టిక్కెట్లు వర్తించనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -