Aishwarya Lekshmi: పెళ్లిపై ఐశ్వర్య లక్ష్మి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Aishwarya Lekshmi: మలయాళ ఇండస్ట్రీ నుండి మెల్లిగా తెలుగులో కూడా మంచి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మల్లు బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన బిగ్గెస్ట్ ఎపిక్ సినిమా ‘పిఎస్1’ లో కూడా ఐశ్వర్య లక్ష్మి మెరిసింది. ఈ మధ్యన తెలుగులో చేసిన ‘అమ్ము’ సినిమాలో ఐశ్వర్య నటనకు గాను మంచి గుర్తింపు, మన్ననలు దక్కాయి.

చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ప్రస్తుతం మంచి హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ఐశ్వర్య లక్ష్మి.. మలయాళంతో పాటు తమిలం, తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది. ఓ పక్క హీరోయిన్ గా సినిమాల్లో బిజీగా ఉంటూనే ప్రొడ్యూసర్ గా కూడా అడుగులు వేస్తోంది ఐశ్వర్య లక్ష్మి.

తాజాగా తమిళంలో తీసిన ఓ సినిమాకు టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నిర్మాతగా మారగా.. ఆ సినిమా తెలుగులో ‘మట్టి కుస్తి’ పేరుతో వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య లక్ష్మి.. ఆ సినిమా ప్రమోషన్లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటోంది. ఈ క్రమంలో మీడియాలో ఆమె ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మీడియా ప్రతినిధులు ఐశ్వర్య లక్ష్మిని ప్రశ్నిస్తూ.. ‘మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా?’ అని ప్రశ్నించగా.. ఆమె ఎవరూ ఊహించని రిప్లై ఇచ్చింది. తనకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి మీద అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఐశ్వర్య లక్ష్మి ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -