Akhanda: ఫిల్మ్ ఫేర్ లో అఖండకు అన్యాయం.. బాలయ్య మూవీకి మోసం జరిగిందంటూ?

Akhanda: బెంగళూరులో జరిగిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో అఖండకు చోటు దక్కకపోవడం పట్ల నందమూరి అభిమానులే కాదు సగటు సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిలింఫేర్ అవార్డుల్లో మొత్తం పుష్ప హవా నడవటంపై ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు.

తెలుగులో వచ్చిన పుష్ప, అఖండ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలకు రెవిన్యూ పరంగా వ్యత్యాసం ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాలలో చూస్తే పుష్ప కంటే అఖండనే బయ్యర్లకు ఎక్కువ లాభాలు తెచ్చిందనేది నిజం. బన్నీ మూవీ కొన్ని నష్టాలు తెచ్చిందని అప్పట్లో దర్శకుడు తేజ చెప్పడం హాట్ టాపిక్ అయిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ఫిలింఫేర్ అనేది ఏదో ప్రమాణాలు పెట్టుకుని జాతీయ అవార్డులా కాదు. అన్ని కమర్షియల్ సినిమాలనూ ఇందులో లెక్కలోకి తీసుకుంటారు. ఆ మాటకొస్తే పుష్ప ఒక అడవి సంపదను దోచుకుని డాన్ గా ఎదిగే స్మగ్లర్ కథ. కానీ అఖండ అలా కాదు. బాలయ్య పోషించిన అఘోరా పాత్ర ద్వారా హిందూ మత తత్వాన్ని గొప్పదనాన్ని చెబుతూనే కమర్షియల్ హంగుని జొప్పించిన మాస్ ఎంటర్ టైనర్. కథ పరంగా చూసినా మంచి కంటెంట్ అఖండలోనే ఉందనేది బాలయ్య ఫ్యాన్స్ వాదన. నటన పరంగా చూసినా అల్లు అర్జున్, బాలకృష్ణ ఎవరినీ తక్కువ అంచనా వేయలేం.

ఈ ఫిలింఫేర్ నిర్వహించేది బాలీవుడ్ కావున వాళ్లకు పుష్ప ఉత్తరాదిలో సాధించిన హిట్ కొలమానంగా కనిపించి ఉండొచ్చు. అఖండను ఆ సమయంలో హిందీలో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేయలేదు. దానివలన అక్కడి ఆడియన్స్ కి చేరువ కాలేకపోయింది. తర్వాత హాట్ స్టార్ లో చూసిన వాళ్ళు ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అని అనుకున్నారు. ఇదంతా అఖండని హైలైట్ చేయడానికి కాదు. కమర్షియల్ సినిమాలకు పురస్కారాలు ఇచ్చేటప్పుడు ఒకదాని మీదే ఫోకస్ కావడం వల్ల వచ్చిన చిక్కు ఇది. రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డులు కనుమరుగయ్యాక వీటి ప్రాధాన్యం ఎక్కువయ్యింది .

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts