Akhil Akkineni: అఖిల్ మూవీకి అంత బడ్జెట్ అవసరమా?

Akhil Akkineni: సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరిగేవారు ఎంతోమంది ఉంటారు. చాన్సులు వచ్చినా ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఓ అదృష్టమనే చెప్పాలి. కానీ కొందరి విషయంలో చిత్ర రంగంలోకి రావడం సులువనే చెప్పాలి. వారసత్వం కార్డుతో సినిమాల్లోకి వచ్చేసి.. స్టార్లుగా వెలుగుతున్న వారెందరినో చూస్తూనే ఉన్నాం.

 

వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్లతోపాటు మహేష్ బాబు, పవన్ కల్యాణ్​, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్​ లాంటి టాప్ స్టార్స్ వరకు దాదాపుగా అందరూ వారసులేననేది తెలిసిందే. అయితే ఈ స్టార్లు కేవలం వారసత్వంతోనే స్టార్లు అయిపోలేదు. తమ ట్యాలెంట్ ను మెరుగుపర్చుకుంటూ, ఎంతగానో కష్టపడి ఏళ్లుగా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అందుకే వారికి అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

 

వారసత్వంగా సినిమాల్లకి వచ్చి ఫేడవుట్ అయినవారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారసత్వంగా వచ్చే వారిపై విపరీతమైన అంచనాలు ఉంటాయి. దీన్ని వారు అందుకోకుంటే కొనసాగడం కష్టమవుతుంది. అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు అదే ప్రయత్నంతో ఉన్నారు. ఎన్నో చిత్రాలు చేసిన సరైన హిట్ ను అందుకోలేదాయన. కేవలం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మాత్రమే విజయాన్ని సాధించింది.

వామ్మో.. అంత బడ్జెటా?

ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే ఆలోచనలో ఉన్న అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.80 కోట్లు దాటిపోయిందని వినికిడి. అఖిల్ మార్కెట్ తెలిసిన వాళ్లు ఇంత బడ్జెట్ పెట్టడం ఏంటని అంటున్నారు. సరైన హిట్ లేని అఖిల్ కు ఇంత బడ్జెట్ పెడితే ఎలా అని.. మూవీ వర్కవుట్ కాకపోతే మరో ‘లైగర్’ అవ్వడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -