Akhil: బాలయ్యకు దిమ్మతిరిగే షాకిచ్చిన అఖిల్.. ఏం జరిగిందంటే?

Akhil: అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా యూట్యూబ్ లోఈ ట్రైలర్ వీడియో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 12 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుని నందమూరి నట సింహం బాలకృష్ణ రికార్డులను బద్దలు కొట్టింది. ఇలా సినిమా బాలయ్య రికార్డ్స్ బద్దలు కొట్టడంతో ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

 

బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ యూట్యూబ్లో 24 గంటలలో 10 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది.ఇలా ఈ సినిమా 10 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోగా ఏజెంట్ 12 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో బాలయ్య వీరసింహారెడ్డి రికార్డ్స్ ను అఖిల్ ఏజెంట్ బద్దలు కొట్టిందని చెప్పాలి.

 

ఇలా బాలయ్య రికార్డును బ్రేక్ చేయడంతో అఖిల్ ఏజెంట్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక అఖిల్ కూడా ఏజెంట్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సినిమాలేవి తనకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి.ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ చిత్రంగా తిరిగిన ఈ సినిమాపై అఖిల్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -