Akkineni Nagarjuna: స్టార్ హీరో నాగార్జునకు తీరని కోరిక ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Akkineni Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మన్మధుడు నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు తరాల ప్రేక్షకులను హీరోగా మెప్పిస్తూ వస్తున్నాడు నాగ్. ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు నాగార్జున. దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం. ఇక నాగార్జున అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాలని నాగ్ చాలా పట్టుపట్టాడు. ఈ నేపథ్యంలో నాగార్జున పలు రకాలుగా ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు సంబంధించిన విషయాలను బయట పెడుతున్నాడు.

ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ తన మనసులో తీరని కోరికల గురించి బయట పెట్టాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు అన్ని తరహాలో జోనర్స్ చేసాడు నాగార్జున. ఇక రాజుగారి గది2 తో హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాన్ని కూడా చేశాడు. కానీ తన కెరియర్లో నాగార్జున ఒక జోనర్ మాత్రం టచ్ చేయలేదు. అదే మైథలజికల్. ఇప్పటివరకు నాగార్జున పెద్దగా పౌరాణిక పాత్రలో నటించలేదు. ఇక రామాయణం, మహాభారతం కథలను కూడా ఎప్పుడు టచ్ చేయలేదు. ఇక ఫైనల్ గా ఆ జానర్ పై స్పందిస్తూ అలాంటి సినిమాలు చేయాలని ఉంది అని తెలిపాడు.

ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాగార్జున పెరిగింది ఆ సినిమాలతోనే అని నాన్నగారు కూడా చిన్నప్పుడు పౌరాణిక సినిమాలు చేశారని నాగార్జున వెల్లడించారు. ఇక ది గోస్ట్ సినిమాతో నాగార్జున ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక నాగార్జున త్వరలో రాబోయే సినిమాల విషయానికి వస్తే అగ్నివర్షం అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు అర్జున్ సజనాని దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -