Akkineni Heroes: అక్కినేని స్టార్ హీరోలకు ఇంగ్లీష్ టైటిల్స్ అచ్చిరావడం లేదా?

Akkineni Heroes: సినిమాలకు సినిమా టైటిల్ బజ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. టైటిల్ విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కంటెంట్ కి తగ్గట్టుగా టైటిల్ లేకపోతే అలాంటి సినిమా ఫ్లాప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగు టైటిల్స్ కంటే ఇంగ్లీష్ టైటిల్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇంగ్లీష్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ పేర్ల మీద అదేం మోజో అర్థం కావడం లేదు కానీ ఓపెనింగ్ రోజు మాస్ ని ఒకరకంగా ఇవే దూరం చేస్తున్నాయి.

అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ టైటిల్స్ అంతగా కలిసి రావడం లేదు. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయినా కస్టడీ సినిమా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తమిళనాడు లో కనీసం ఇరవై లక్షలు కూడా చేయాలేదని తెలుస్తోంది. గత ఏడాది చైతు థాంక్యూ సినిమాతో కూడా ఇదే ఫలితాన్ని అందుకున్నాడు. అలాగే అఖిల్ ఏజెంట్ సినిమా ఫలితాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే నాగార్జున వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, ఆఫీసర్ టైటిల్స్ చూస్తే నెట్ ఫ్లిక్స్ లో వచ్చే హాలీవుడ్ వెబ్ సిరీస్ లాగా అనిపిస్తాయి. అన్ని రిజల్ట్స్ ఒకటే. ఏం మార్పు లేదు. కనీసం యావరేజ్ కూడా కాదు. అదే అచ్చమైన తెలుగులో పెట్టుకున్న బంగార్రాజు, మజిలీలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు.

 

దీంతో అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ టైటిల్స్ సెట్ కావడం లేదని ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టిన సినిమాలు అన్నీ కూడా భారీగా నిలిచాయి అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అక్కినేని హీరోలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతుండడంతో వారి సినిమా ఫలితాలు కూడా అందుకే అలా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కినేని హీరోలు నటించిన సినిమాలకు తెలుగు టైటిల్స్ చూసుకుంటే ఆ సినిమాలు పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -