Suma Kanakala: అయ్యో.. యాంకర్ సుమను వేధిస్తున్న వ్యాధి లక్షణాలివే!

Suma Kanakala: తెలుగు ప్రేక్షకులను ఎన్నో దశాబ్దాలుగా ఎంటర్టైన్ చేస్తూ, తన మాటలతో అందరినీ నవ్విస్తున్న యాంకర్ సుమ. నిజానికి కేరళకు చెందిన సుమ.. తెలుగు మీద పూర్తి పట్టును సాధించడంతో పాటు సమయానికి తగ్గట్టుగా పంచులు పేలుస్తూ విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ ను పొందింది. బుల్లితెర మీద లెక్కలేనన్ని షోలు చేయడంతో పాటు సినిమా ఫంక్షన్లు అన్నింటిని దాదాపు యాంకర్ సుమనే హ్యాండిల్ చేస్తోంది.

 

తెలుగులో మరే యాంకర్ కు సాధ్యం కాని ఎన్నో విషయాలను, ఫీట్లను సుమ సాధించింది. చివరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా సుమ చోటు సంపాదించుకుంది. తెలుగు బుల్లితెర మీద అత్యధిక కాలం పాటు టీవీ షోని నడిపిన యాంకర్ గా సుమ రికార్డులకెక్కింది. అయితే సుమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఓ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని స్వయంగా ప్రకటించింది.

 

హీరో, హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్ సుమ.. త్వరలోనే యాంకరింగ్ కు గుడ్ బై చెప్పబోతోందనే వార్త సంచలనం రేపడం తెలిసిందే. అయితే యాంకర్ సుమ ఓ వింత వ్యాధితో బాధపడటమే ఇందుకు కారణంగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనకు వచ్చిన వ్యాధి గురించి, దాని తీవ్రత గురించి ఆమె వివరించింది. దాని వల్ల తాను ఎంతలా బాధపడుతున్నానే విషయాన్ని సుమ పేర్కొంది.

 

తాను ‘కీలాయిడ్ టెండెన్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు యాంకర్ సుమ వివరించింది. ఈ వ్యాధి చర్మానికి సంబంధించిందని ఆమె వివరించింది. ఈ వ్యాధి వల్ల చర్మానికి గాయం తగిలినప్పుడు దాన్ని సరిచేయడానికి ఫైబరస్ కణజాలం ఏర్పడాల్సి ఉంటుందని కానీ ఈ కీలాయిడ్‌ సమస్య ఉన్న వారిలో మాత్రం గాయం పక్క కణాలకు కూడా సోకుతూ పెరిగిపోతుందని ఆమె తెలిపింది. దీని వల్ల కీలాయిడ్స్ అని పిలిచే కణాజాలాన్ని ఏర్పడుతుందని వివరించింది. అంటే అసలైన గాయం కంటూ కూడా ఈ కీలాయిడ్స్ పెద్దగా తయరవుతాయని.. ఇవి భయంకరమైన హానికరం కావు కానీ చికాకు కలిగిస్తాయని తన పరిస్థితి గురించి సుమ వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -