Narayanaguda: లవ్ చేసే అమ్మాయిలకు అలర్ట్.. ఇలాంటి దుష్టులుంటారు జాగ్రత్త!

Narayanaguda: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చదువుకుంటున్నప్పటికీ వారి ఆలోచన ధోరణి ఏ మాత్రం బాగలేదని చెప్పాలి. చాలామంది యువతి యువకులు అడ్డదారులు తొక్కుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చదువుతున్నటువంటి ఒక యువతని నలుగురు అబ్బాయిలు తమ కోరిక తీర్చాలి అంటూ ఒత్తిడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

నారాయణగూడలోని ఓ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి తన క్లాస్ మేట్ దగ్గర కొంత డబ్బు తీసుకుంది. అయితే ఆ యువకుడు తన డబ్బు తనకు వెనక్కి తిరిగి చెల్లించాలని తనపై ఒత్తిడి చేశారట కానీ ఆ యువతి డబ్బు చెల్లించలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని తన కోరిక తీరస్తే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తనపై ఒత్తిడి చేశాడు. ఇక అప్పు చెల్లించలేని ఆ యుక్తి ఆ యువకుడి కోరిక తీర్చడానికి సిద్ధమైంది.

 

ఈ క్రమంలోనే దగ్గరలో ఓయో రూం బుక్ చేసుకుని ఆ యువతి ఆ యువకుడి కోరికను తీర్చంది. అయితే ఆ యువతికి తెలియకుండా యువకుడు రహస్యంగా తనతో గడిపిన ఈ సమయాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. అయితే ఆ వీడియోని తన స్నేహితుల నలుగురికి ఫార్వర్డ్ చేయడంతో ఆ స్నేహితులకు కూడా ఆ యువతపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు.

 

తమ కోరిక కూడా తీర్చాలని లేకపోతే ఈ వీడియోని వాట్సప్ గ్రూపులలో ఇన్స్టాగ్రామ్ లోను పోస్ట్ చేస్తామంటూ తనని బెదిరించడం మొదలుపెట్టారు. ఇలా వారి కోరికలు తీర్చడానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో సదరు విద్యార్థులు వీడియోని వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో ఆ యువతి షీ టీమ్ ను ఆశ్రయించింది. ఆ అమ్మాయి వీడియో తీసి వైరల్ చేసిన నిందితులపై కేసు నమోదు చేయాలని నారాయణగూడ పోలీసులకు షీ టీమ్ సిఫార్సు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -