Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నాలుగు రోజులు వర్షాలేనా?

Alert: గత కొంతకాలంగా విపరీతమైన ఎండలతో మండిపోతున్న ప్రజలకి ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వాతావరణ శాఖ అధికారులు ఇదే విషయాన్ని శనివారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు. తెలంగాణలో కథ రెండు రోజులుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరొక నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ సూచిస్తుంది. 22న జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరులో వర్షాలు పడతాయి.

 

గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. మే 23 వ తారీఖున జనగాం, ములుగు, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ కారణంగానే నాలుగు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

 

24వ తారీఖున కూడా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్రంగా జిల్లాల్లో వర్షాలు పడతాయి అంటూ ముందస్తు సమాచారాన్ని అందజేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిన సంగతి మనకి తెలిసిందే.

 

మళ్ళీ వర్ష సూచన అనేసరికి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రైతుల బాధ ఆ విధంగా ఉంటే కాస్తయినా వేడి నుంచి ఉపశమనం దొరుకుతుందని సామాన్య ప్రజలు సంతోషిస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే అవకాశం ఉండటంతో ప్రజలని అప్రమత్తంగా ఉండాలని.. బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అధికారులు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -