Ali: పవన్ కల్యాణ్‌తో విబేధాలు నిజమేనా? అలీ ఏమన్నాడంటే..?

Ali: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పవన్ నటించిన ప్రతి సినిమాలోనూ దాదాపు అలీ ఉండేవారు. తన ప్రతి సినిమాలోనూ అలీ ఉండాలని డైరెక్టర్లకు పవన్ ముందే చెబుతాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది. సినిమాలో అలీ తన పక్కన ఉంటే ఎంతో సరదాగా ఉంటుందని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాలలో చెప్పారు.

 

సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతం కూడా పవన్, అలీ మంచి స్నేహితులు. రాజకీయంగా వేరే వేరే పార్టీలు అయినా.. పర్సనల్ గా ఇద్దరి మధ్య ఇప్పటికీ సన్నిహిత్యం అలాగే ఉందని చెబుతూ ఉంటారు. పవన్ తనకు మంచి స్నేహితుడని ఇప్పటికీ అలీ పలు ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నాడు. కానీ అలీ వైసీపీలోకి వెళ్లడం వల్ల పవన్ తో గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది.

 

ఈ క్రమంలో పవన్ తో గ్యాప్ పెరిగినట్లు వస్తున్న వార్తలపై తాజగా ఓ షోలో అలీ స్పందించాడు. అలీ హోస్ట్ గా అలీతో సరదాగా అనే ప్రొగ్రాం ఈటీవీలో ప్రసారమవుతోంది. ఈ షోకు తాజాగా సుమ గెస్ట్ గా వచ్చింది. అయితే సుమ యాంకర్‌గా మారి అలీని ప్రశ్నలు అడిగింది. డిసెంబర్ 19న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రొమో రిలీజ్ అయింది. ఈ ప్రొమోలో పవన్ తో తనకున్న అనుబంధం, గ్యాప్ విషయంపై అలీ స్పందించాడు. పవన్. మీకు మధ్య గ్యాప్ ఎలా వచ్చింది అని సుమ ప్రశ్నించింది.

 

సుమ అడిగిన ప్రశ్నకు అలీ సమాధానమిస్తూ.. తనుకు, పవన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నాడు. తనకు, పవన్ కు మధ్య గ్యాప్ ఉందనేది ప్రచారం మాత్రమేనని, కొంతమంది కావాలనే అలా సృష్టిస్తున్నారని అలీ చెప్పాడు. తన కూతురు పెళ్లికి కూడా పవన్ వస్తానని అన్నారని, కానీ చివరి నిమిషంలో విమానం మిస్ కావడం వల్ల రాలేకపోయారని అలీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -