Alia Bhatt: భర్తకు షాకిచ్చిన అలియా.. కూతురి ముద్దుపేరు ఏంటంటే?

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ల జంట.. ఓ పండంటి పాపకు జన్మనివ్వడం తెలిసిందే. బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసిన వీళ్లు.. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకొని.. ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న ఈ యువ జంట.. అందరికీ షాక్ ఇచ్చేలా త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు.

 

 

అలియా భట్, రణ్ బీర్ కపూర్ లు అనుకున్నట్లుగానే ఓ పాపకు జన్మనిచ్చి.. తల్లిదండ్రులు అయ్యారు. ఈ వార్తను సోషల్ మీడియాలో వెల్లడించి అందరినీ ఖుషీ చేశారు. కాగా ఇప్పుడు ఈ పాపకు పెట్టిన పేరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలియా భట్ ఎంతో ఇష్టంగా ఆ పాపకు ఓ పేరు పెట్టిందని.. కానీ అది భర్త రణ్ బీర్ కపూర్ కు మాత్రం అస్సలు నచ్చలేదట.

అలియా భట్ తన మాజీ ప్రియుడి పేరును తన పాపకు పెట్టుకుందట. నిజానికి అలియా భట్, రణ్ బీర్ కపూర్ ల పాపకు ఓ పేరును రణ్ బీర్ అనుకున్నాడట. తన తండ్రి రిషి కపూర్ పేరు వచ్చేలా రణ్ బీర్ కపూర్ ఓ పేరు అనుకున్నాడట. ఇక అసలు పేరు ఎలాగూ రణ్ బీర్ కపూర్ పెట్టాడు కాబట్టి.. ముద్దు పేరు మాత్రం తానే పెట్టాలని నిర్ణయించుకుందట.

అందులో భాగంగా అలియా భట్ తన పాపకు ‘అరా’ అని పేరు పెట్టిందట. ‘అరా’లో తన పేరులో మొదటి అక్షరంతో పాటు తన మాజీ ప్రియుడు రణ్ వీర్ సింగ్ పేరు వచ్చేలా మరో అక్షరాన్ని పెట్టుకుందట. దీనిపైనే అలియా మరియు రణ్ బీర్ కపూర్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఈ విషయంలో రణ్ బీర్ కపూర్ అలియా మీద కోపంగా ఉన్నాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts