Alia Bhatt: రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అలియా!

Alia Bhatt: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి RRR సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాజాగా రాజమౌళి మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

తాజాగా టైమ్స్ మ్యాగజైన్ వందమంది ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలను విడుదల చేశారు. ఇలా ఈ జాబితాలో దర్శకుడు రాజమౌళి అలాగే నటుడు షారుఖ్ ఖాన్ చోటు సంపాదించుకోవడం విశేషం. ఇలా రాజమౌళి కూడా ఈ జాబితాలో ఉండడంతో నటి ఆలియా భట్ రాజమౌళి గారికి అలాగే షారుఖ్ ఖాన్ కుశుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఈమె రాజమౌళి గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ తాను మొదటిసారి రాజమౌళి గారిని బాహుబలి ప్రీమియర్ షోలో చూసానని తెలిపారు.ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా ఆశ్చర్యపోయానని ఎలాగైనా ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఆరోజు అనుకున్నాను అని తెలిపారు. అలాగే RRR సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అలియా భట్ వెల్లడించారు.ఈ సినిమాతో నా కోరిక నెరవేరిందని ఈమె తెలిపారు. ఇక రాజమౌళి గారితో పనిచేయడం గురించి ఈమె మాట్లాడుతూ…

రాజమౌళి గారి వద్ద పనిచేయడం అంటే స్కూల్ కి వెళ్లడంతో సమానం అని తెలిపారు. ఆయన దగ్గర నటనలో ఎన్నో కొత్త విషయాలు కొత్త అంశాలను నేర్చుకోవచ్చని అలియా వెల్లడించారు. నేను రాజమౌళి గారిని మాస్టర్ స్టోరీ, టెల్లర్ అని పిలుస్తానని తెలియజేశారు. నాకు ఏదైనా సలహా ఇవ్వమని రాజమౌళి గారిని అడగడంతో ఆయన నాకు సలహా ఇస్తూ… ఏ క్యారెక్టర్ లో నటించిన దానిని ప్రేమతో చేయాలని చెప్పారు. సినిమా ప్రేక్షకాదరణ పొందకపోయినా మనం చేసిన పాత్ర వారికి గుర్తుండి పోయేలా నటించాలని రాజమౌళి గారు నాకు సలహా ఇచ్చారు అంటూ ఈ సందర్భంగా అలియా గుర్తు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -