Alia Bhatt: కపూర్ ఫ్యామిలీలో సందడి.. పాపకు జన్మనిచ్చిన అలియాభట్‌

Alia Bhatt: బాలీవుడ్ సెలబ్రిటీ దంపతులు అలియాభట్-రణ్‌బీర్ కపూర్ మాతృత్వ బంధంలోకి అడుగుపెట్టింది. అలియాభట్ ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్న అలియాభట్ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌లో ఈ రోజు ఉదయం చేరింది. మధ్యాహ్నం డెలివరీ కావడంతో అలియా పండంటి పాపకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు సంతోషకరమైన వార్తను చెప్పారు.

 

తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. హాస్పిటల్‌లో భర్త రణ్‌బీర్ కపూర్, నీతూ కపూర్ , షాహిన్ భట్, సోని రజ్దాన్ తదితరులు ఉన్నారు. కపూర్ ఫ్యామిలీలో ఆడబిడ్డ పుట్టడంతో అలియాభట్-రణ్‌బీర్ కపూర్‌ను పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

 

కాగా, ఈ ఏడాది జూన్‌లో తాము తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు అలియాభట్- రణ్‌బీర్ కపూర్ దంపతులు ప్రకటించారు. ఈ మేరకు పాపకు సంబంధించిన స్కానింగ్ ఫోటోలను షేర్ చేశారు. అయితే చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.

 

ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, ఇటీవల వారిద్దరు జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. ఈ సినిమా ఆగస్టులో విడుదలైంది. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts