Alitho Saradaga: స్నేహారెడ్డి గన్ను పెట్టినా అల్లు శిరీష్ ఆ సీక్రెట్స్ చెప్పరా?

Alitho Saradaga : కమెడియన్ ఆలీ నిర్వహిస్తున్న షో.. ఆలీతో సరదాగా. ఈటీవీ కార్యక్రమాల్లో దీనికి ప్రత్యేకత ఉంది. సినీ ప్రముఖులను ఆహ్వానించి వింతలు, విశేషాలు చెబుతూ ఉంటాడు ఆలీ. ఈ క్రమంలో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. జూనియర్ ఆర్టిస్టులతో సహా చాలా మంది ప్రముఖులు ఆలీ షోకు హాజరవుతూ ఉంటారు. అలనాటి పాత హీరోయిన్లు కూడా ఇందులో ఉండటం విశేషం.

 

ఈతరం హీరోలు కూడా చాలా మంది ఈ షోలో పాల్గొంటూ తమ అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఆలీ కూడా వాళ్ల పర్సన్ విషయాల్లో వాళ్లే ఆశ్చర్యపోయేలా క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఈ షో మొదటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నాడు.

 

ఫ్యామిలీ మ్యాటర్స్ లాగిన ఆలీ..
ఈ సందర్భంగా తాను రీసెంట్ గా నటించిన ఊర్వశివో, రాక్షసివో చిత్రం విశేషాలు పంచుకున్నాడు. అలాగే వ్యక్తిగతంగా ఫ్యామిలీ మ్యాటర్లు కూడా లాగాడు ఆలీ. కొన్ని విషయాలు చెప్పేందుకు శిరీష్ సిగ్గుతో తలదించుకున్నాడు కూడా. అల్లు అర్జున్ చాలా సీక్రెట్స్ నీకు చెబుతాడంట కదా.. అని ఆలీ అడుగుతాడు. దానికి నిజమేనని చెబుతాడు శిరీష్. ఆ విషయాలు మా వదిన గన్ను పెట్టి అడిగినా చెప్పలేనని చెబుతాడు.

 

అన్ని విషయాలూ ఎవరో ఒకరితో చెప్పుకోవాలని కదా.. అది మా అన్నయ్య విషయంలో నేనే అని శిరీష్ చెబుతాడు. తర్వాత ఊర్వశివో, రాక్షసివో సినిమా గురించి ఆలీ ప్రస్తావిస్తాడు. సినిమాలో ముద్దు సీన్ కోసం ఎన్ని టేకులు తీసుకున్నావని అడుగుతాడు. దానికి సిగ్గు పడతాడు శిరీష్. అను ఇమ్మాన్యుయేల్ చాలా బాగా యాక్ట్ చేసిందని చెబుతాడు. పుష్ప సినిమా ఫస్ట్ డే టాక్ సందర్భంగా ముంబైలో ఉన్నానని, ఆ సమయంలో తాను అల్లు అర్జున్ సోదరుడని అక్కడ చాలా మందికి తెలియదని, ఆ మూవీ గురించి మాట్లాడుకుంటుంటే చాలా సంతోషం అనిపించిందన్నాడు. తాను నటించిన చిత్రాల్లో ఎవరైనా బాగుందని మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -