Chandrababu: పవన్ కు అన్ని సీట్లే ఇస్తా.. చంద్రబాబు ఫిక్స్ అయ్యారా?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ మార్పు దిశగా తన పయనం సాగిస్తుంది. తండ్రికి తగ్గ పాలన అందిస్తాడని భావించినా జగన్, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ, రెఫరెండంగా భావించిన ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి షాక్ ని ఇచ్చారు.రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం మంచి మెజారిటీతో గెలుచుకుంది.అటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని, ఇటు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాన్ని రెండింటినీ టిడిపి కైవశం చేసుకుంది.

తెలుగుదేశం పార్టీ మొత్తం పండుగ చేసుకుంటోంది. అయితే ఇదే సమయంలో జనసేన పార్టీ మాత్రం కుమిలి కుమిలి విలపిస్తోంది. పవన్ కళ్యాణ్ కొత్తగా పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ గెలుపు సాధిస్తే, ఆయనకు ఏడుపు ఎందుకు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది. కానీ వాస్తవంలో జనసేన ఖర్మకొద్దీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి విజయం సాధించింది అని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

 

జనసేన పార్టీ తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రకటించకపోయినా వాళ్లేమీ దాచిపెట్టడం లేదు. అయితే పవన్ కల్యాణ్ కు కేవలం 20 సీట్లు ఇవ్వడానికి మాత్రమే చంద్రబాబు అంగీకరించారని, అందుకోసమే పవన్ ఇంకా బహిరంగంగా ప్రకటన చేయకుండా మల్లగుల్లాలు పడుతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై జనసైనికులు ఆగ్రహించారు.

 

ఇది నిజం కాదని వారికి నచ్చజెప్పడానికి పవన్ కు తలప్రాణం తోకకు వచ్చింది.ఎలాగో ఒకలాగా చంద్రబాబును మెప్పించి.. తన బందరు సభ బలం చూపించి తాను తోడు లేకపోతే తెలుగుదేశం గెలవదు అనే భ్రమ కల్పించి ఎక్కువ సీట్లు పొందాలనేది పవన్ కల్యాణ్ వ్యూహాం.

 

కానీ అది అంతా తిరగబడింది.ఉత్తరాంధ్ర,తూర్పు రాయలసీమ పట్టభద్ర ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించడంతో చంద్రబాబు చెట్టెక్కి కూర్చోవడానికి అవకాశం ఏర్పడింది. ఇంతకు మించి ఇవ్వనని పవన్ ను బెదిరించడానికి అవకాశం ఏర్పడింది. అయితే పవన్ విలపించడానికి మరో కారణం ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జనసేన మద్దతు అధికారికంగా పొందడానికి చంద్రబాబు ప్రయత్నించారు. కానీ పవన్ స్పందిదంచలేదు. మరోవైపు బిజెపి అభ్యర్థి.. తాను జనసేన–బిజెపి ఉమ్మడి అభ్యర్థినని ప్రకటించుకున్నారు.

 

ఆ సమయంలో పవన్ తెలుగుదేశానికి మద్దతు ప్రకటించి ఉన్నా సరే ఈ విజయం కేవలం తన వల్లనే వచ్చిందని డప్పు కొట్టుకోడానికి అవకాశం ఉండేది. అది కూడా లేకుండా పోయింది.అందుకే పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం విజయాన్ని చూసి మన ఖర్మకొద్దీ వీరిలా విజయం సాధించారని బాధపడుతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -