Uday Kiran: ఉదయ్ కిరణ్ నాతో మాట్లాడిన చివరి మాటలు ఇవే: అల్లరి నరేష్ 

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఒకానొక సమయంలో ఈయన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. అయితే ఈయన ఎంత తొందరగా క్రేజ్ సొంతం చేసుకున్నారో అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఇలా వరుస ప్లాపులు వెంటాడటంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన సినిమాలు టీవీలో ప్రసారమైన అభిమానులు కన్నార్పకుండా చూస్తారు. ఇకపోతే ఉదయ్ కిరణ్ మరణ వార్త గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.ఇకపోతే తాజాగా అల్లరి నరేష్ ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం అలాగే ఉదయ్ కిరణ్ మరణించే ముందు తనతో మాట్లాడిన చివరి మాటల గురించి బయట పెట్టారు.
ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ చనిపోయే కొద్దిరోజుల ముందు తన వద్దకు వచ్చారని , ఆ సమయంలో ఉదయ్ కిరణ్ చాలా డల్ గా కనిపించారని అల్లరి నరేష్ వెల్లడించారు. ఎందుకు అలా డల్ గా కనిపిస్తున్నారు ఏమైంది అని అడగ్గా సినిమాలో యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో ఫెయిల్ అవుతున్నారు అంటూ వార్తలు రాశారని బాధపడ్డారు.దానికి నువ్వెందుకు బాధపడుతున్నావ్ అని అనగా సరైన కథలు ఎంపిక చేసుకోకపోతే ఉదయ్ కిరణ్ లా మారిపోతారు అంటూ తన పేరును కూడా ప్రస్తావించారని నరేష్ వెల్లడించారు. ఇలా తనని కలిసిన కొద్ది రోజులకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఇవే ఆయన తనతో మాట్లాడిన చివరి మాటలు అంటూ నరేష్ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -