Allagadda MLA: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఊరమాస్ వార్నింగ్.. అఖిలప్రియకు షాకిస్తూ?

Allagadda MLA: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.బ్రిజేంద్ర‌రెడ్డి పెద్ద ఎత్తున అవినీతి చేశారంటూ అఖిల ప్రియ ఆరోపణలు చేయడంతో అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ తనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రిజేంద్ర‌రెడ్డి మాట్లాడుతూ…అఖిల తన గురించి మాట్లాడుతూ…తాను పెద్ద ఎత్తున భూదోపిడి ఇసుక దోపిడి స్కామ్ చేశానంటూ మాట్లాడుతున్నారు. అలాగే తన కుటుంబంపై కూడా నోరు పారేసుకుంటున్నారు. తాను ఇలాగే మాట్లాడితే తను కూడా తన దారిలోనే వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

తాను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్కామ్ చేశానని ఇసుక దోపిడీ చేస్తున్నానంటూ అఖిల ప్రియ మాట్లాడారు. అందుకు సరైన ఆధారాలు నిరూపించాలని తెలిపారు అలాగే తాను 2012 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చానని రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రాజకీయాలలో కొనసాగడం కోసం ఏమి అమ్మానో.. ఏమి కొన్నానో ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ తో సహా బయట పెడతానని బ్రిజేంద్ర‌రెడ్డి పేర్కొన్నారు.

 

ఇక తన గురించి లేనిపోని మాటలు మాట్లాడితే అసలు సహించడని రాజకీయ లబ్ధి కోసం ఇలా చిల్లర మాటలు మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేయడం సరైంది కాదని అఖిల ప్రియకు బ్రిజేంద్ర‌రెడ్డి హెచ్చరించారు. ఇక అఖిలప్రియ ఇప్పటికైనా తనపై విమర్శలు ఆపకపోతే తను కూడా వారి బాగోతం బయట పెట్టాల్సి ఉంటుందని
ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక తన వల్ల ఏ కుటుంబం అయితే బాధపడ్డారో ఆ కుటుంబాలతోనే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.

 

రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారి రాజకీయాలు చేయడం తనకు రాదనీ, అఖిల ప్రియ రాజకీయాలలో కొనసాగుతూ చేసిన మోసాలన్నీ బయట పెడితే తాను కనీసం బయట తిరగడానికి కూడా వీలు లేకుండా పోతుంది అంటూ ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి భూమా అఖిల ప్రియకు తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అఖిలప్రియ గురించి బ్రిజేంద్ర‌రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -