PM Modi: మోదీకి షాక్.. ఎన్డీయేకు వ్యతిరూకంగా కూటమి

2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ బలంగానే ఉంది. కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కొలేకపోవడం, గ్యాస్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెగడంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేక ఉంది. కానీ అది బీజేపీని అధికారం నుంచి దూరం చేసేంద వ్యతిరేక ప్రజల్లో లేదు. ఇక దేశంలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలంగా లేకపోవడం. నాయకత్వం సరిగ్గా లేని కారణంగా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా బలం మరింత పుంజుకుంది.

ఇలాంటి తరుణంలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. మోదీకి వ్యతిరేకగా ప్రాంతీయ పార్టీలు బలంగా పోరాడుతున్నాయి. సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ లాంటి నేతలు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగానే నిలబడుతున్నారు. ఇటీవల ఈ జాబితాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా చేరారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేక నేతలతో జట్టు కట్టే పనిలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే బాద్యతలను తాను తీసుకుంటానని ప్రకటించారు.

ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ కలిసి వస్తే తాను ముందుకు తీసుకెళ్తానని నితీష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరముందని తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా ఇప్పటికే కేసీఆర్, కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ వంటి నేతలు జట్టు కడుతున్నారు. ఇటీవల కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించిన బీజేపీకి వ్యతిరేకంగా నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కర్ణాటకలో దేవగౌడ, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రలో శరద్ పవార్ వంటి నేతలన కలిశారు.

బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ ఒకే గోడుకు కిందకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలు మోదీని ఓడించడం కష్టమని, కాంగ్రెస్ ను కూడా కలుపుకోవాలని శరద్ పవార్ బహిరంగ ప్రకటన చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దీంతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ ఎలా పనిచేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శరద్ పవార్ ప్రకటనతో కేసీఆర్ కు షాక్ తగిలినట్లు అయింది. దీంతో దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉండగా.. దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఈ క్రమంలో నితీష్ కుమార్ తెరపైకి తెచ్చారు. మోదీకి వ్యతిరేకంగా తాను ప్రతిక్ష,విపక్ష పార్టీలను ఏకం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ పాత్రను నితీష్ కుమార్ పోషించబోతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ చాలా సీనియర్. దీంతో రానున్న రోజుల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా నితీష్ కుమార్ ఏం చేస్తారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తారా.. లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -