Prabhas: భారీ మొత్తం ఆఫర్ చేసిన అల్లు అరవింద్.. ప్రభాస్ ఏమన్నారంటే?

Prabhas: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై అన్ స్టాపబుల్ షో ఎంతగానో పాపులర్ అయ్యింది. ఆ షోకు నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరించడంతో షో సూపర్ డూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారి విషయాలను తెలుసుకుంటూ బాలయ్య సక్సెస్ అయ్యారు. బాలయ్య ప్రశ్నలకు సినీ, రాజకీయ తారలు కూడా తమదైన శైలిలో జవాబులు ఇస్తున్నారు. ఇకపోతే తాజాగా అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ రానున్నారు. దీనికి సంబంధించి చిన్నపాటి వీడియో కూడా ఇప్పటికే వైరల్ అయ్యింది.

 

అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ తో కలిసి బాలయ్య సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య-ప్రభాస్ కాంబో ఎపిసోడ్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనలేదు. ఆయన తన సినిమా ప్రమోషన్స్ అప్పుడు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాను కూడా ఆయన అస్సలు వినియోగించరు. కాబట్టి అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ హాజరుకావడం గొప్ప విషయం అని అందరూ చర్చించుకుంటున్నారు.

అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ ని బాలయ్య హోస్ట్ చేయనుండగా అనేక ఆసక్తికర విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ గురించి బాలయ్య ప్రశ్నలు వేయనున్నాడు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మొహమాటం లేకుండా అన్నీ ప్రశ్నలు అడగడం మనం గమనించాం. గెస్ట్ లైఫ్ లో ఉన్న వివాదాలు, పుకార్ల గురించి ప్రత్యేకంగా బాలయ్య ప్రస్తావిస్తుంటారు.

 

ప్రభాస్ వివాహం ఎందుకు చేసుకోవడం లేదనే ప్రశ్న అభిమానులతో పాటు సగటు మూవీ లవర్ ని ఎప్పటి నుంచో వేధిస్తుండటంతో బాలయ్య ఈ చిక్కు ప్రశ్నకు ప్రభాస్ నుండి సమాధానం రాబడతాడని అందరూ ఆశిస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా హీరో గోపీచంద్ కూడా జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఎపిసోడ్ కి ఎక్కడలేని హైప్ వచ్చి చేరిందని ఇండస్ట్రీ కోడైకూస్తోంది. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ షోకు రావడానికి ప్రభాస్ కు ఒక మంచి అమౌంట్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ గెస్ట్ గా హాజరు కావడానికి అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. అయితే ప్రభాస్ మాత్రం తనకు డబ్బులు వద్దని మీపై ఉన్న గౌరవంతో ఈ షోకు వస్తున్నానని చెప్పి ఆ డబ్బు ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -