Allu Arjun: విద్యార్థినిని దత్తత తీసుకున్న బన్నీ.. ఇలాంటి హీరోలు ఉన్నారా?

Allu Arjun: తెలుగులో స్టైలిష్ గా ఉండే హీరో ఎవరని అంటూ ఎవరైనా చెప్పే పేరు అల్లు అర్జున్. ‘గంగోత్రి’ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ.. ఎన్నో మైలురాళ్లను ఎక్కుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తెలుగుతో పాటు పలు భాషల్లో అభిమానులను సంపాదించుకున్న బన్నీ ప్రస్తుతం ‘పుష్ప2’ మీద వర్కవుట్ చేస్తున్నాడు. కాగా తాజాగా బన్నీ చేసిన ఓ పని ఆయన అభిమానులను గర్వపడేలా చేస్తోంది.

 

అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మందికి సాయంలా నిలిచాడు. చాలామంది కొత్త నటులు, కొత్త దర్శకులు ఎవరైనా కొత్త ప్రయత్నం చేస్తుంటే వారికి సాయంగా నిలుస్తుంటాడు బన్నీ. అలాంటి బన్నీ తాజాగా ఓ అమ్మాయికి చేసిన సాయం వార్తల్లో నిలిచింది. కరోనా మన జీవితాల్ని ఎలా మార్చేసిందో అందరికీ తెలుసు. అలాంటి కరోనా వల్ల దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ చదువుల తల్లికి అల్లు అర్జున్ అండగా నిలిచాడు.

కేరళకు చెందిన ఓ నర్సింగ్ చదువుతున్న అమ్మాయి.. కరోనా కాలంలో తన తండ్రిని కోల్పోయింది. దీంతో తనకు సాయం చేయాలని ఆమె కలెక్టర్ ని కలిసింది. సదరు కలెక్టర్ బన్నీతో ఒక సంవత్సరం కట్టి సాయపడాలని కోరాడు. వెంటనే స్పందించిన అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. ఆమె చదువు పూర్తయ్యే వరకు మొత్తం ఫీజు తానే కడతా అని చెప్పి మాటిచ్చాడు.

తన తండ్రిని కోల్పోవడంతో నర్సింగ్ మధ్యలోనే వదిలివెయ్యాల్సి వస్తుందని భయపడుతూ ఉన్న ఆ అమ్మాయికి బన్నీ ఆపన్నహస్తం అందించాడు. ఆ అమ్మాయి జీవితాన్ని మార్చడమే కాకుండా.. ఆమెను దత్తత తీసుకుంటున్నానని కూడా బన్నీ మాటిచ్చాడు. దీంతో బన్నీ మంచి మనసుకు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని అంటున్నారు. మొత్తానికి బన్నీ చేస్తున్న సాయం ఎంతోమందికి ఆదర్శనీయం.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -