Allu Arjun: ఆ సినిమాలన్నీ హిట్లు కావా బన్నీ.. ఇలాంటి చెత్త కామెంట్లు అవసరమా?

Allu Arjun: టాలీవుడ్ ప్రేక్షకులకు అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య, బన్నీ వంటి సినిమాలో నటించి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆపై పలు సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

ఇటీవలే విడుదలైన పుష్ప సినిమా ద్వారా బన్నీ పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ గా హడావిడి చేస్తున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఫిదా చేసాడు. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. త్వరలో పుష్ప పార్ట్ 2 తో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఏదేమైనా బన్నీ కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. పుష్ప సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదని, ఈ సినిమా సక్సెస్ పొందలేకపోతే అభిమానుల ప్రేమను పొందడానికి మరో 20 సంవత్సరాలు పట్టేదని అల్లు అర్జున్ వెల్లడించాడు. అయితే బన్నీ ఇలా మాట్లాడటంతో కొందరు నెటిజన్లు బన్నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కాదా? అని కొందరు అడుగుతున్నారు.

ఇక మరికొందరు మాత్రం బన్నీ కెరీర్ లో పుష్ప సినిమా తప్ప మరో హిట్ లేదా అని అడుగుతున్నారు. తన కెరీర్ లో మంచి హిట్ లు ఉన్నా కూడా ఇటువంటి చెత్త కామెంట్లు అవసరమా అని కొందరు అడుగుతున్నారు. దీని గురించి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక బన్నీ రాబోయే సినిమాల విషయానికొస్తే AA21 అనే ప్రాజెక్టుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -