Allu Arjun: బన్నీపై నెటిజన్ల విమర్శలు.. నిజంగానే తప్పు చేశారా?

Allu Arjun: సెలబ్రిటీలు సినిమాల్లో ఎలా మాట్లాడినా డైలాగ్ అనుకుని ప్రజలు ఏమీ పట్టించుకోరు. కానీ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఎంతో ఆచితూచి మాట్లాడాలి. కొంచెం టంగ్ స్లిప్ అయినా సరే.. నెటిజన్లు ఆ రోజు ఓ ఆట ఆడేసుకుంటారు. ఈ విషయం సెలబ్రిటీలకూ తెలుసు. అందుకే సెలబ్రిటీలు ఎంతో ఆచితూచీ మాట్లాడుతారు. కానీ అప్పుడప్పుడు కోపానికి వెళ్లి వల్గర్‌గా కామెంట్లు చేస్తుంటారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, నెటిజన్లు వాళ్లను ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలానే టంగ్ స్లిప్ అయి.. అనవసరంగా ఇరుక్కుపోయాడు. అల్లు అర్జున్ చేసిన కామెంట్ల వల్ల.. తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. అసలేం జరిగిందో? అల్లు అర్జున్ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంత టాలెంట్‌లో ఎదిగాడు. సినిమాల్లో స్లాంగ్ ఎంతో ఇంపార్టెంట్. ఇప్పటివరకు రిలీజ్ అయిన చాలా వరకు సినిమాల్లో తెలంగాణ యాస ఎంతో ప్రత్యేకం. అల్లుఅర్జున్ కూడా తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా.. తన కూతురు అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో అర్హ.. వాళ్లింట్లో కందిరీగలు పెట్టిన ఓ పుట్ట గురించి అల్లుఅర్జున్‌కు వివరిస్తూ ఉంటుంది. అప్పుడు అల్లు అర్జున్.. అర్హకు ఏదో ఓ విషయం గురించి అడిగితే తెలంగాణ స్లాంగ్‌లో జవాబిస్తుంది.

 

 

దానికి అల్లు అర్జున్.. ఏంటీ తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారు. బన్నీని.. ‘నీకు తెలంగాణలో ఇల్లు ఉండాలి. అభిమానులు ఉండాలి. కానీ తెలంగాణ యాసలో మాట్లాడితే అంత చిన్న చూపా. తెలంగాణ యాసే ఇష్టం లేనప్పుడు నీ సినిమాలు ఈ రాష్ట్రంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నావు. ఏపీలోనే రిలీజ్ చేసుకుని.. అక్కడికే వెళ్లి సెటిల్ అవ్వు.’ అని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -