Allu Arjun: అల్లు అర్జున్ కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Allu Arjun: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజాగా ఓ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆర్య, పుష్ప లాంటి సంచలన చిత్రాలు అందించిన డైరెక్టర్‌ సుకుమార్‌ లేకపోతే తాను లేనంటూ వ్యాఖ్యానించాడు అల్లు అర్జున్‌. 18 పేజెస్‌ మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్‌.. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. షార్ట్‌ అండ్ స్వీట్ స్పీచ్‌తో అల్లు అర్జున్‌ అందరినీ ఆకట్టకున్నాడు. ఈవెంట్‌లో సుకుమార్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు బన్నీ. సుకుమార్ లేకపోతే తాను లేనని.. మూవీ కెరీర్ తను ఇచ్చిందే అంటూ అల్లు అర్జున్‌ కామెంట్‌ చేశాడు.

 

సినిమా కాస్త లేట్‌ అయినా తన నుంచి సుకుమార్‌కు ప్రెజర్‌ ఉండదని చెప్పాడు. ప్రస్తుతం సుకుమార్‌ శిష్యుడు డైరెక్ట్‌ చేయడం, సుక్కు నిర్మాతగా ఉండడంతో 18 పేజెస్‌ మూవీ కాస్త స్పెషల్‌ అని చెప్పాడు బన్నీ. సుకుమార్‌పై ఎప్పటికీ కృతజ్ఞతా భావంతోనే ఉంటానని బన్నీ వ్యాఖ్యానించాడు. ఇక పుష్ప2 గురించి మాట్లాడిన బన్నీ.. సుకుమార్‌ త్వరగా అప్‌డేట్‌ ఇవ్వకపోతే సినిమాలో డైలాగ్స్‌ అన్నీ రివీల్‌ చేసేస్తానంటూ సరదాగా చురకలంటించాడు.

త్వరలోనే పుష్ప2 గురించి అప్‌డేట్‌ వస్తుందని బన్నీ క్లారిటీ ఇచ్చాడు. 18 పేజెస్‌ మూవీ గురించి చెబుతూ సినిమా చాలా బాగుంటుందని చెప్పాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ను బన్నీ అభినందించాడు. ఓ సినిమా పూర్తవగానే వెంటనే మరో మూవీ చేతిలో పెట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడంటూ దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తాడు బన్నీ.

 

ఇలాంటి మంచి కథలను ఎలా ఎంపిక చేస్తాడో..
హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ గురించి చెబుతూ.. నిఖిల్ ఇలాంటి మంచి కథలను ఎలా సెక్ట్ చేసుకుంటాడో తనకు అర్థం కాదన్నాడు. పుస్తకాలు చదవడం వల్లే ఇలాంటి కథలను ఎంపిక చేస్తానని నిఖిల్‌ తనతో చెప్పాడని అల్లు అర్జున్‌ తెలిపాడు. ఇలా మంచి కథలు ఎంచుకుంటున్నందుకు నిఖిల్‌ను అభినందించాడు బన్నీ.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -