Allu family: ఆ హీరోయిన్ కు ప్రాధాన్యత ఇస్తున్న అల్లు ఫ్యామిలీ.. కానీ?

Allu family: తెలుగు సిని ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. అల్లు రామలింగయ్య నుంచి అల్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లు రామలింగయ్య తర్వాత అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అల్లు శిరీష్ కూడా సినిమా ఇండస్ట్రీలి ఇచ్చిన్నప్పటికి ఇప్పటివరకు అల్లు శిరీష్ కి సరైన హిట్టు రాలేదు.

 

ఇది ఇలా ఉంటే అల్లు ఫ్యామిలీకి సంబంధించి తాజాగా ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే అల్లు ఫ్యామిలీ ప్రస్తుతం ఒక హీరోయిన్ భజన చేస్తోందట. ఆ హీరోయిన్ కి భజన చేయడంతో పాటు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తోందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. అనుపమ, నిఖిల్ కలిసి నటించిన 18 పేజెస్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో బాగా అల్లు అర్జున్ అనుపమ ని ఒక రేంజ్ లో పొగిడాడు.

 

అల్లు అరవింద్ అంతకుముందు ఒక సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ నీలాంటి కూతురు ఉంటే బాగుండు అని స్టేజ్ పైనే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హీరో అల్లు శిరీష్ కూడా గతంలో తన సినిమాలోకి అనుపమని తీసుకోవాలని భావించినప్పటికీ అది కుదరలేదు. ఇలా అల్లు ఫ్యామిలీ మొత్తం అనుపమ భజనే చేస్తుండడంతో మరి ఆమెలో వారికి అంతగా ఏం నచ్చిందో తెలియడం లేదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -