Allu Ramalingaiah Wife: ఇప్పటివరకు చూడని అల్లు రామలింగయ్య భార్య ఎలా ఉందో చూశారా?

Allu Ramalingaiah Wife: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హాస్యనటుడుగా ఒక రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు రామలింగయ్య గారు. అలా నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక రామలింగయ్య గారి కొడుకు అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా ఇటీవల అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాలను కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఆ కార్యక్రమానికి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు అల్లు రామలింగయ్య గారి స్నేహితులు, ఆయన సన్నిహితులు హాజరయ్యారు. ఇలా నటీనటులు ఎందరో ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అయితే వీరందరి దృష్టి మాత్రం అల్లు రామలింగయ్య గారి భార్య అయినటువంటి కనకరత్నం మీద పడింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు అల్లు ఫ్యామిలీ ఈమెను చూపించలేదు.

కొన్ని అనారోగ్యాల కారణంగా కనకరత్నం ఎప్పుడు మీడియా ముందు కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఆమెకి 92 సంవత్సరాల అని ఆమె కొడుకు అల్లు అరవింద్ తెలిపాడు. అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా తన భార్య కనకరత్నం ను అల్లు అరవింద్ స్టేజ్ మీదకు తీసుకొని వచ్చాడు. ఇక అల్లు రామలింగయ్య పై రాసిన పుస్తకం ఆమెకు సభా ముఖంగా అందజేశారు.

ప్రస్తుతం అల్లు రామలింగయ్య గారి భార్య కనక రత్నం గారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకుముందు ఈమె ఎప్పుడూ కనిపించకపోవడంతో చాలామంది ఈమె ఫొటోలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నానమ్మ గారు కావడంతో బన్నీ ఫ్యాన్స్ మరింత ఎగబడి ఆమె ఫోటోలు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కూడా నేను ఈ స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా తాతయ్య గారు కూడా ఉంటే నా ఎదుగుదలని చూసి చాలా ఆనందపడేవారు అని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -