Allu Sirish: తమ్ముడు శిరీష్ ను సపోర్ట్ చేయని బన్నీ.. కారణాలివేనా?

Allu Sirish: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన హీరోగా నటించిన ‘కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఏబీసీడీ’ తదితర సినిమాలతో మెప్పించిన శిరీష్.. తాజాగా ‘ఊర్వశివో.. రాక్షసివో..’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాకేశ్ శశి దర్వకత్వం వహించిన ఈ సినిమాలతో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో ఓ వార్త సెన్సెషన్‌ అయింది. తమ్ముడు శిరీష్ సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం లేదనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమాపై అల్లు అర్జున్ ఇప్పటివరకూ ఒక్క ట్విట్ కూడా చేయలేదు. అలాగే టీజర్, ట్రైలర్‌కు కూడా అటెండ్ కాలేదు. ఎక్కడా మద్దుతు తెలిపినట్లు దాఖలాలు లేవు. దీంతో అటు నెటిజన్లు ఇటు ఫ్యాన్స్ ఆశ్చరానికి గురవుతున్నారు.

 

 

‘ఏబీసీడీ’ సినిమా తర్వాత అల్లు శిరీష్ ‘ఊర్వశివో.. రాక్షసివో..’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఫ్లాపుల్లో కొనసాగుతున్న ఈ హీరోకి.. ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో అవసరం. అందుకే ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయోషనల్ ఈవెంట్లను తన భుజాలపై వేసుకుని వచ్చాడు. సినిమా ప్రయోషన్స్ లో భాగంగా పలు షోలల్లో పాల్గొన్నారు. ఆయా షోల హోస్ట్ లు కూడా తమ పూర్తి మద్దతు తెలిపారు. కానీ అల్లు అర్జున్ కూడా మద్దతు తెలిపితే బాగుండేదని నెటిజన్లు భావిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. శిరీష్ సినిమాకు మద్దతు తెలిపారు. అలాగే హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్‌లో విషెస్ చెప్పాడు. సాధారణంగా ఇతర హీరోలను ప్రయోట్ చేసే అల్లు అర్జున్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడనే ప్రశ్న ప్రేక్షకులను వెంటాడుతోంది. ఇప్పటివరకు అల్లు శిరీష్ చేసిన ప్రతి ఈవెంట్, సినిమాను ప్రయోట్ చేసిన బన్నీ కేవలం ఈ ఒక్క సినిమాకే దూరమయ్యారు. దీనికి కారణం కూడా ఎవరికీ తెలియదు. కానీ అల్లు ఫ్యాన్స్ మాత్రం విష్ చేయనంత మాత్రానా తమ్ముడి సినిమాను విస్మరించినట్లు కాదని చెబుతున్నారు. ఈ సినిమా అల్లు వారి సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందిందని, అందుకే టీమ్ మొత్తం ఇదే పనిలో బిజీగా ఉన్నారని, బన్నీ అవసరం లేదని అభిమానులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts