Balakrishna: ఆ సినిమా పోయిందిగా.. బాలయ్య ఓపెన్ స్టేట్ మెంట్

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. అది సినిమా సెట్ లో అయినా, షూటింగ్ సమయంలో అయినా, బయట వేదికలపై అయినా, ఆహా షోలో అయినా… ఇలా బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని ఫ్యాన్ చెబుతుంటారు. తాజాగా బాలయ్య ముక్కుసూటి తనంగా మాట్లాడతారనే దానికి నిదర్శనంగా ఓ ఈవెంట్ లో ఇన్సిడెంట్ జరిగింది.

అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఊర్వశివో, రాక్షసివో. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. వేదిక మీదకొచ్చిన బాలయ్య తన దైన శైలిలో ఫన్ క్రియేట్ చేశారు.

ఈ ఫంక్షన్ లో అల్లు శిరీష్ బాలకృష్ణ ను ఓ ప్రశ్న అడుగుతాడు. బాలయ్య దానికి తనదైన స్టైల్ లో జవాబిచ్చాడు. ఆ జవాబు విన్నాక బాలయ్య ఎంత ముక్కు సూటి మనిషో మరోసారి జనాలకకు తెలిసొచ్చింది. అందుకే అందరూ జై బాలయ్య అంటారని చెబుతున్నారు.

సినిమా ఫట్.. నేరుగా చెప్పేశాడు..

సినిమాలన్నాక కొన్ని విజయం సాధిస్తుంటాయి. లేదా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటిది అది తన సినిమా అయినా సరే ఆడిందో లేదో టక్కును చెప్పేశాడు బాలయ్య. అల్లు శిరీష్.. బాలయ్యను సింహ, సింహంతో ఉన్న పేర్ల సినిమాలు చెప్పమంటాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మి నరసింహ, జయసింహా, ఇప్పుడు రాబోతున్న వీర సింహ రెడ్డి.. ఇలా సినిమా పేర్లు చెబుతాడు. ఇంకోటి కూడా ఉంది చెప్పమంటాడు అల్లు శిరీష్. బొబ్బిలి సింహం అని చెబుతాడు బాలయ్య. మరో సినిమా ఉందంటాడు అల్లు శిరీష్. తర్వాత శిరీష్ సింహం నవ్వింది సినిమా ఉందని చెబుతాడు. ఈ సమయంలో సింహం నవ్వింది పోయిందిగా.. అని సమాధానమిస్తాడు. లేకపోతే సింహం నవ్వటం ఏమిటి? అందుకే పోయింది అని సమాధానమిస్తాడు.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -