Allu Sirish: అల్లు శిరీష్ నటుడిగా అందుకే ఫెయిలయ్యాడా?

Allu Sirish: అల్లు శిరీష్ ఇప్పటివరకు సాలీడ్ హిట్ ఇవ్వలేదు. కానీ తన ఖాతాలో డీసెంట్ సినిమాలే ఉన్నాయి. ‘కొత్త జంట, శ్రీరస్తు-శుభమస్తు’ సినిమాలు ఓకే అనిపించాయి. ఇప్పుడు ‘ఊర్వశివో.. రాక్షసివో..’ సినిమా పర్వాలేదని అనిపించుకుంది. అయితే ఈ సినిమాలు మూడూ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చినవే. అల్లు శిరిష్‌లో స్పాంటేనిటీ, ఎనర్జీ, సెన్సాఫ్ హ్యూమర్, బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ వీసమెత్తు లక్ లేదు. ఇండస్ట్రీలో అల్లు కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ ఒకరికి అదృష్టం కొండంత ఉంటే.. మరొకరికి ఆవగింజంత కూడా లేదు. వీరిద్దరి కథలు ఒకేరీతిలో సాగాలని ఏముంది. అందరికీ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ స్టోరీలు తెలిసే ఉంటుంది.

ముఖేష్ అంబానీ అన్ని రంగంల్లో రాణిస్తుంటే.. అనిల్ అంబానీ అక్కడే స్టాప్ అయ్యారు. సేమ్ అల్లు అర్జున్ కూడా అందనంత ఎత్తుకు ఎదిగాడు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు. అల వైకుంఠపురం సినిమాతో బన్నీ స్టార్ హీరోగా ఎదిగాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. హార్డ్ వర్కింగ్, డ్యాన్సింగ్‌తో తనదైన శైలిలో స్టెప్పులు వేసే హీరోలు టాలీవుడ్‌లో ఎవరూ లేరు. క్లాస్, మాస్ పర్ఫార్మెన్స్‌ తో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇందులో బన్నీ లక్ కూడా కలిసొచ్చింది. పుష్ప జోరుతో మరో పదేళ్ల పాటు బన్నీకి ఢోకా లేకుండా పోయింది.

కానీ అల్లు శిరీష్‌కు డ్యాన్స్ పెద్దగా చేయలేడు. మాస్ యాక్టింగ్ కూడా రాదు. 2019లో వచ్చిన ఏబీసీడీ సినిమా తర్వాత ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్యార్ ప్రేమ కాదల్ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేళకు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పేరును మొదట్లో ‘ప్రేమ కాదంట’ అని టైటిల్ పెట్టారు. ఆ తర్వాత టైటిల్ ఛేంజ్ చేశారు. ఈ సినిమాలో హీరో అను ఇమ్మాన్యుయేల్‌తో లిప్ సీన్స్, రొమాంటిక్ సీన్లు ఉన్నప్పటికీ సినిమాకు హిట్ టాక్ ఏమీ రాలేదు. పెట్టిన పెట్టుబడికి లాభం రావొచ్చు. కానీ శిరీష్ ఇంకా ఫెయిల్‌లోనే కొనసాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -