Thodu Needa Matrimony: తోడు నీడ ఆర్గనైజేషన్ గురించి తెలుసా.. షరతులు ఏంటంటే?

Thodu Needa Matrimony: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా చదువులు ఉద్యోగాలు అంటూ తమ తల్లిదండ్రులతో కలిసి జీవించడం లేదు. ఇలా తల్లిదండ్రులు ఒకచోట పిల్లలు ఇతర రాష్ట్రాలలోనూ లేదా విదేశాలలోనూ స్థిరపడి ఉంటారు.ఇక ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటూ ఒకే ఇంట్లో దాదాపు పది 20 మంది వరకు ఉండేవారు కానీ ఇప్పుడు చిన్న ఫ్యామిలీలుగా కేవలం ఒక ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉంటున్నారు.

ఇలా పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిరపడటం కోసం ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలలో స్థిరపడి ఉండగా తల్లిదండ్రులు మాత్రం ఇంట్లోనే ఉంటారు. అయితే వయసు పైబడే కొద్ది తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మరణిస్తే మిగిలినవారు ఒంటరిగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉండలేనటువంటి తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడం కోసం పిల్లలు వారిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరుస్తున్నారు.

 

అయితే ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నప్పటికీ చాలామంది ఒంటరి అనే భావనలోనే ఉంటున్నారు. అయితే ఇలాంటి భావనలో ఉండకుండా తనకంటూ ఒకరు ఉన్నారని భరోసా కల్పిస్తోంది తోడునీడు ఆర్గనైజేషన్ .ఈ ఆర్గనైజేషన్ ద్వారా 50 సంవత్సరాలు పైబడిన ఆడవారికి లేదా మగవారికి తప్పనిసరిగా ఒక తోడు అవసరమని అలా ఒంటరిగా ఉన్నవారికి తోడును కల్పిస్తుంది ఈ ఆర్గనైజేషన్.ఇలా 50 సంవత్సరాలు పైబడిన వారికి పెళ్లి చేసి వారికి ఒక తోడును కల్పించడమే కాకుండా వారి ఒంటరితనాన్ని దూరం చేస్తోంది.

 

ఇక ఈ ఆర్గనైజేషన్ లో మనం చేరాలి అంటే తప్పనిసరిగా కొన్ని షరతులు వర్తిస్తాయి. తోడు నీడ ఆర్గనైజేషన్లో జాయిన్ కావాలి అంటే తప్పనిసరిగా 50 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి 49 సంవత్సరాలు వయసు అయినా కూడా ఇందులో చేర్చుకోవడానికి అనుమతి లేదు. ఇక ఒంటరి అని నిరూపించుకోవడానికి సరైన ప్రూఫ్ కూడా ఉండాలని తెలుస్తోంది.భర్త లేదా భార్య చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది లేదా విడాకులతో విడిపోతే డివర్స్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి ఈ విషయాలను వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -