Amala: అమలాపాల్ కు సినిమా ఆఫర్లు తగ్గడానికి కారణం అతనేనా?

Amala: సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు లవ్, ఎఫైర్లు నడుస్తుంటాయి. కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వారి విషయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. సినిమాల్లో తమకంటూ ఒక అండ ఉండాలని, తమ మనసును అర్థం చేసుకునే, తమ ఇండస్ట్రీలోనే పని చేసే వాళ్ల కోసం మామూలుగానే ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి బెడిసికొడుతుంటాయి.

 

కొంతమంది హీరోలు మరియు హీరోయిన్ల విషయంలో లవ్ లేదంటే ఎఫైర్ల వల్ల కెరీర్ నాశనం అవుతుంటుంది. ఇలాంటి కోవలోనే తమిళ హీరోయిన్ అమలాపాల్ కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తెలుగులోనూ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అమలాపాల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ భామ ఓ టాప్ హీరో మోజులో పడి తన కెరీర్ ను నాశనం చేసుకుందని తెలుస్తోంది. తమిళంలో తిరుగులేని స్టార్ గా ఉన్న సదరు హీరోతో సినిమాలు చేసిన అమలాపాల్.. అతడికి పెళ్లి జరిగినా కూడా ఇష్టపడిందట. అలా అతడి విషయంలో తనను తాను మర్చిపోవడంతో తన కెరీర్ మీద దృష్టిసారించలేకపోయిందని టాక్.

 

అమలాపాల్ ఎవరినైతే ఇష్టపడిందో.. ఆ హీరో మాత్రం అంతకంతకు కెరీర్ లో కొత్త మెట్లు ఎక్కుతుంటే అమలాపాల్ మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ మధ్యన పెళ్లి చేసుకొని ఎవరికీ కనిపించకుండా పోయిన హీరోయిన్ అమలాపాల్.. కొన్నాళ్లకే తన భర్త నుండి విడిపోయి తిరిగి వార్తల్లో నిలిచింది. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్, అవకాశాలు వస్తున్న సమయంలో అమలాపాల్ ఆ టాప్ హీరో మోజులో పడి తన కెరీర్ ను చేతులార నాశనం చేసుకుందని ఇండస్ట్రీ కోడైకూస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -