Curry Leaves: కరివేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Curry Leaves: భారతీయ వంటల్లో తరుచుగా వాడే వాటిలో కరివేపాకు కూడా ఒకటి. మంచి వాసన కోసమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం, ఆహారానికి రుచి రావడం కోసం మనం మన వంటల్లో కరివేపాకును వాడుతూ ఉంటాం. అయితే కరివేపాకును తినడం వల్ల మనకు అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిలో కొన్నింటిని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం:

మనలో చాలామందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఉంటుంది. మారిన ఆహార అలవాట్లు, వాతావరణం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అయితే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కరివేపాకు తింటే ప్రయోజనం పొందుతారు. ఉదయం పూట గ్లాస్ నీళ్లు తాగి ఐదు నిమిషాల తర్వాత నాలుగు కరివేపాకు ఆకులను నోట్లో వేసుకొని నమలాలి. ఇవి తిన్న అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందట.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

మనం వంటల్లో మామూలుగా వాడే కరివేపాకు వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వండే ఆహారంలో కరివేపాకును ఎక్కువగా వేయడం వల్ల వారి కంటి చూపు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి సాయం:

ఈమధ్యన చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి కరివేపాకు కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకు తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

జీర్ణక్రియ మెరుగు:

కరివేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో జీర్ణక్రియ మెరుగుపడటం కూడా ఉంది. ఖాళీ కడుపుతో కరివేపాక ఆకులను తింటే ఎంజైమ్స్ క్రమబద్ధీకరించబడతాయి. మూత్రనాళం బాగా పని చేసేలా చేస్తుంది, ఫలితంగా మలబద్దకం సమస్య తీరుతుంది.

కరివేపాకులో విటమిన్ సి, పాస్పరస్, ఐరన్, క్యాల్షియం, నికోటినిక్ యాసిడ్ లు ఉంటాయి. వీటి వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మెరుగైన ఫలితాల కోసం కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే మంచిదని నిపుణులు సలహా ఇస్తారు.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -