Ambati Rambabu: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారనే ప్రచారం ఇప్పటికీ జోరుగానే సాగుతూ ఉంది. గతంలో టీడీపీ, జనసేన నేతలు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, అందరూ సిద్దంగా ఉండాలని తెలుగు తమ్ముళ్లకు పలుమార్లు సూచించారు. ఇక జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా ఏపీలో ముందస్తు ఎనన్నికలు వస్తాయని అనేకసార్లు వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే కామెంట్స్ చేశారు.
దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ ప్రచారం జరిగింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. దీంతో కేసీఆర్ తరహాలో సీఎం జగన్ కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతారనే ప్రచారం జరుగుతోంది. జగన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండ కూడా ఉంది. ఇప్పటికే బీజేపీ, వైసీపీ మధ్య పరోక్ష సంబంధాలు ఉన్నాయి. బీజేపీకి పార్లమెంట్ లోప్రతి అంశం మీద వైసీపీ మద్దతు ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే ఆ రెండు పార్టీల మధ్య ఇంకా పరోక్ష సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.
దీంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపే అవకాశం స్పష్టంగా ఉంది. ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల దగ్గరకు వెళుతుండటం, నియోజవకర్గాల వారీగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు నిర్వహిస్తుండటంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ల కేటాయింపుపై జగన్ దృష్టి పెట్టడం, కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పెంచడంతో ముందస్తు ఎన్నికల కోసమే జగన్ దూకుడు పెంచారనే టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోన్నాయి. వైఎస్సార్ చేయూత మడో విడత నిధులను విడుదల చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. ఈ సందర్బంగా డబ్బులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం గడ్డపైనుంచే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కుప్పం మే కూలిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. అంబటి వ్యాఖ్యలతో వచ్చే సంత్సరంలో మేలోనే ఎన్నికలు జరుగుతాయని, అందుకే అలా కామెంట్లు చేశారనే టాక్ ఏపీ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది.
షెడ్యూల్ ప్రకారమే 2024 ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. 2024 వరకు ఉంటే వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముంది. ఇప్పుడు ఎన్నికలవరకు వెళితే లాభపడవచ్చని, వ్యతిరేకత తక్కువ ఉన్నంతువల్ల మళ్లీ అధికారంలో రావొచ్చని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లి లాభపడినట్లుగానే.. జగన్ కూడా ఇప్పుడు ఎన్నికలు వెళ్తే ప్రయోజనం ఉంటుందనే చర్చలు సాగుతున్నాయి. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలటీ, నగర పాలక సంస్థల ఎనన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు ఖాయమనే ఆలోచనల జగన్ ఉన్నట్లు ప్రచారం సాగుతోది.