TRS-Congress: టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆ రెండు పార్టీల పొత్తు ఉంటుందని టీ పాలిటిక్స్ లో ఎప్పినుంచో ప్రచారం జరుగుతోంది. గతంలో బీజేపీ నేతలు రాహల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్ సపోర్ట్ చేయడం, బీజేపీపై విరుచుకుపడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను విమర్శించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెుస్ పొత్తు ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. గులాబీ పార్టీ నేతల నుంచి ఎలాంటి రెస్సాన్స్ లేదు.
కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం టీఆర్ఎస్ పై పొత్తుపై స్పందించారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఊహాజనిత అంశమని టీ కాంగ్రెస్ నేతుల కొట్టిపారేశారు. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఈ వార్తలను కొట్టిపారేశారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండే ప్రసక్తే లేదని, ఒకరి తప్పులను తాము పూసుకోమని రేవంత్ సెటైర్ వేశారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారని, టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారన్నారు. అయినా కూడా టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వార్తలకు బ్రేక్ పడటం లేదు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ సారి ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోట వెంట ఆ మాటం రావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చని, ఎప్పుడైనా వారి పొత్తు ఉంటుందని టీ బీజేపీ నేతలకు సూచించరాు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కానీ, లేదా తర్వాత కానీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ పొత్తు ఉండొచ్చని అమిత్ షా జోస్యం చచెప్పారు.
ఆ రెండు పార్టీలు ఎప్పుడైనా ఒక్కటవుతాయని, ఈ అంశన్ని ప్రజలకు వివరించాలని తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా తెలిపారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే కొంతమంది అమిత్ షా వ్యాఖ్యల పట్ల ఏకీభవిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా బీజేపీని ఎదుర్కొవడం అసాధ్యం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉండకపొచ్చని, ఎన్నికల తర్వాత ఉండొచ్చని అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టకునే విషయం గురించి ఆలోచించాలని కామెంట్స్ చేశారు. ఇలాంటి తరుణంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికకరంగా మారాయి. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై సైలెంట్ గా ఉండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఖండిస్తున్నారు.
బీజేపీ నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని కామెంట్ చేస్తుండగా. . కాంగ్రెస్ నేతుల టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనని ఆరోపిస్తున్నారు. దీంతో ఎవరు ఎటువైపు అనేది ప్రజల్లో కన్ ప్యూజన్ నెలకొంది. ప్రస్తుతం చూస్తే కేసీఆర్ మాత్రం బీజేపీపై తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలకు ముందు కానీ ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది తెలియదు.