Vijayawada: వేడి నీళ్ల బకెట్ లో పడి 8 నెలల చిన్నారి మృతి?

Vijayawada: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కొందరు చిన్నారులు అనారోగ్యాల కారణంగా మరణిస్తుండగా మరికొందరు చిన్నారులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. కుక్కల దాడిలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చిన్నారులు చనిపోగా చాలా మంది చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక కారణంతో చిన్నారులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పిల్లలు తెలిసి తెలియక కొన్ని రకాల వస్తువులను ముట్టుకొని వాటి కారణంగా చనిపోతున్నారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చిట్టి నగర్ లంబాడి పేట గాంధీ బొమ్మ ప్రాంతంలో ఆదిమల్ల ప్రణతి, ప్రేమ్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ పాపకు 8 నెలలు. అయితే ఇంట్లో వేడి నీళ్లు కోసం వీరు వాటర్ హీటర్‌ను వాడుతున్నారు. ఈనెల 27వ తేదీన వేడి నీళ్ల కోసం ఎప్పటి లాగానే వాటర్ హీటర్‌ను పెట్టారు. పాప మంచం పక్కనే ప్లగ్ ఉండటంతో అక్కడ వేడి నీళ్ల కోసం బకెట్ ఉంచారు. అయితే వాటర్ హీటర్ పెట్టిన తర్వాత పనిలో పడిపోయింది ప్రణితి. ఆ సమయంలో భర్త కూడా ఇంట్లో లేడు.

 

కాసేపటికి పాప ఏడుపు వినిపించడంతో తల్లి వెంటనే గదిలోకి పరుగులు తీసింది. అయితే అప్పటికే పాప ఆ వేడి నీటి బకెట్లో పడిపోయి కనిపించింది. వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పాపను బయటకు తీసేసరికి చిన్నారి శరీరమంతా కాలిపోయింది. ఈ హడావుడికి అక్కడికి చేరుకున్న స్థానికులతో కలిసి పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇటీవల ఆ చిన్నారి మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -