Anasuya: సుధీర్ విషయంపై అనసూయ ఆగ్రహం..చిందులేసిన హాట్ యాంకర్

Anasuya: ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ బాగా పాపులర్ అయింది. ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా తమలోని టాలెంట్ ను బయటపెట్టుకున్నారు. ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా పాపులర్ అయి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ షో ద్వారా పేరు తెచ్చుకుని చాలామంది కమెడియన్లు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెట్టారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా పేరు తెచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు.

 

జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన సుధీర్.. ఆ తర్వాత నటుడిగా పలు సినిమాలు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే హీరోగా సుధీర్ పలు సినిమా చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోగా వరుస ఆఫర్లతో సుధీర్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే బుల్లితెరపై కూడా సుధీర్ పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సుధీర్ ఎంట్రీతో అనసూయ, రష్మి లాంటి యాంకర్లకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు.

 

అయితే తాజాగా సుధీర్ పై హాట్ యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది. సుధీర్ తన కంటే చాలా జూనియన్ అని, తన నుంచి చాలా నేర్చుకున్నాడని అనసూయ తెలిపింది. ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. సుధీర్ గురించి మాట్లాడింది. సుధీర్ కంటే తాను యాంకర్ గా చాలా సీనియర్, సుధీర్ తన జూనియర్ అని మర్చిపోయారా? అంటూ వ్యాఖ్యానించింది. సుధీర్ తో పనిచేయడం ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనసూయ చాలా సీరియస్ అయింది.

 

తనతో పనిచేయడం ఎలా ఉంది అని సుధీర్ ను అడగండి. అతడితో పనిచేయడం ఎలా ఉంది అని నన్ను అడగకండి అంటూ అసహనం వ్యక్తం చేసింది. సుధీర్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, సినిమాల విషయంలో అతడు చాలా కష్టపడతాడు అని అనసూయ పేర్కొంది. అతడితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంటుందంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -