Anasuya Bharadwaj: అనసూయ కెరీర్ ముగిసినట్లేనా.. జాతకంలో అలాంటి సమస్యలా?

Anasuya Bharadwaj: జబర్దస్త్‌ ద్వారా ఫేమస్ అయిన యాంకర్‌ అనసూయ.. తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రకటనల్లోనూ నటించి పెద్ద మొత్తంలో క్యాష్‌ చేసుకుంది. కోట్లాది రూపాయల ఆస్తిని పోగేసుకుంది. అయితే, ప్రస్తుతం జబర్దస్త్‌ షోలో లేక, సినిమాల్లో అవకాశాలు తగ్గి పొజిషన్‌ కాస్త డౌన్‌ ఫాల్‌ అవుతోంది. అనసూయకు ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదట.

 

ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. విజయ్‌ దేవరకొండ మూవీపై ట్వీట్‌ చేయడంతో రౌడీ ఫ్యాన్స్‌ అనసూయపై రెచ్చిపోయారు. విపరీతమైన నెగిటివ్‌ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు. ఈ క్రమంలో అనసూయ కూడా తగ్గడంలేదు. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో కౌంటర్లు వేస్తూ వస్తున్నారు.

 

అయితే, ఈ మధ్య కాలంలో ఇది మరీ శృతి మించింది. అనసూయను చాలా మంది ఆంటీ అంటూ కామెంట్లు చేయడంతో ఆమె ఏకంగా పోలీస్‌ ఫిర్యాదు కూడా చేసింది. అంకుల్‌, తాతా.. అంటూ అనసూయ కూడా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో అనసూయ గురించి మరో వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనసూయ జాతకంలో కొన్ని దోషాల కారణంగానే ఆమె విపరీతమైన నెగిటివిటీ, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోందట.

 

పూజలు చేయిస్తే దోష నివారణ..
దోష నివారణ కోసం పరిహార పూజలు వీలైనంత తొందరగా చేయించుకుంటేనే అనసూయ కెరీర్‌ మళ్లీ ట్రాక్‌ ఎక్కుతుందంటున్నారు. లేకపోతే ఇక సినిమా కెరీర్‌తోపాటు యాంకరింగ్‌ కెరీర్‌ కూడా నాశనం అయ్యే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని చెబుతున్నారు. గతంలో తనపై ట్రోల్స్‌ వస్తే అనసూయ ఘాటుగా స్పందించేదని, ప్రస్తుతం నోటి దూకుడు ఎక్కువగా ప్రదర్శిస్తోందంటున్నారు. మరోవైపు అనసూయను పుష్ప2 మూవీ నుంచి తొలగించారనే వార్తలు కూడా హల్‌ చల్‌ చేస్తున్నాయి. మొత్తానికి ఈ నెగిటివిటీ అంతా పోవాలంటే గట్టిగా పూజలు చేయాలని అనసూయకు ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -