Anasuya Bharadwaj: మీ అంతు చూస్తా అంటున్న అనసూయ…వైరల్ అవుతున్న ట్వీట్!

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ లైగర్ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా అనసూయ అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు… అందుకు తగ్గ కర్మ ఫలితం ఇప్పుడు రాకపోయినా రావడం మాత్రం పక్కా అంటూ ఈమె చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే ఈ పోస్ట్ పై స్పందించిన విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున అనసూయ పై తిట్ట దండకం మొదలుపెట్టారు.

ఇలా విజయ్ అభిమానులు అనసూయను తిట్టడంతో ఈ కామెంట్లన్నీ మీ హీరోకి ఫార్వర్డ్ చేయండి అంటూ ఈమె మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలా విజయ్ అభిమానులకు, అనసూయకు మధ్య ప్రస్తుతం ట్వీట్ వార్ జరుగుతుంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ వరుస ట్వీట్స్ చేస్తూ మరోసారి విజయ్ అభిమానులపై మండిపడ్డారు. తాజాగా తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన అనసూయ ఛీ..ఛీ ఇదే చెత్త బాబోయ్… క్లీన్ చేస్తున్న కొద్ది వస్తుంది అంటూ ఏడుపు మొహం పెట్టినటువంటి ఒక ఎమోజి షేర్ చేశారు.

అనసూయ ఈ విధంగా చెత్త అంటూ ట్వీట్ చేయడంతో మరోసారి అభిమానులు తనపై వరుసగా ట్వీట్లు చేయడంతో అనసూయ సైతం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా విజయ్ అభిమానులకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేస్తూ నన్ను మీరు తిడుతున్నటువంటి ప్రతి ఒక్క ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి నా వయసుకు మించి నన్ను అందరూ ఆంటీ అని పిలుస్తున్నారు. నా కుటుంబాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ ఈమె చెప్పుకొచ్చారు.

మీరు నన్ను తిట్టే ప్రతి తిట్టుకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిపై కేసు ఫైల్ చేస్తానని ఈమె తెలియజేశారు. ఇలా మీరు చేసే ప్రతి ట్వీట్ కి నేను రిప్లై ఇస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఓ మహిళ చేస్తున్న పోరాటం అందరూ గుర్తించడమే కాకుండా తన గౌరవం కోసం మహిళ పోరాటం చేస్తుందని అందరికీ తెలుస్తుందంటూ ఈమె తెలియజేశారు.అయినా మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఎలాంటి రిలేషన్ లేనప్పుడు నన్ను ఆంటీ అని ఎలా పిలుస్తున్నారు అంటూ ఈ సందర్భంగా అనసూయ వరుస ట్వీట్లు చేస్తూ ఈ వివాదాన్ని సాగదీస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో అయినా ఆగుతుందా లేదంటే ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -