Anasuya: ప్రస్తుతం అనసూయ పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Anasuya: బుల్లితెర రారాజుగా పేరు పొందిన జబర్దస్త్ షో అంటే చాలా మందికి ఇష్టం. ఈ జబర్దస్త్ షో నుంచి యాంకర్ అనసూయ ఈ మధ్యనే బయటకు వచ్చేశారు. అయితే యాంకర్ అనసూయ ఈ షో నుంచి బయటకు వచ్చేశాక ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొన్నటిదాకా స్టార్ మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ కు యాంకర్ అనసూయ వ్యాఖ్యతగా కనిపించారు. ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు.

 

యాంకరింగ్ కు అనసూయ స్వస్తి చెప్పి వరుస‌ సినిమాలకు కమిట్ అవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయిటే ఆమె అటు సినిమాలలో నటిస్తుందా అంటే అది లేదని, ఇటు షోలలో కూడా కనిపించడం లేదని మరికొందరు వాపోతున్నారు. కానీ యాంకర్ అనసూయను మాత్రం చూడకుండా ఉండలేకపోతున్నామని మరికొందరు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

 

గత ఏడాది హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో కూడా అనసూయ నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆ మూవీకి సీక్వెల్ రాబోతోంది. పుష్ప2 సినిమాలో అనసూయ అద్భుతంగా నటించనుందని పలువురు అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఎందులో నటిస్తుందో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

సినిమాల్లో ఛాన్సులు వస్తుండటం వలన జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటికి వచ్చేసిందని, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆమెకు వచ్చిన సినిమా ఆఫర్లు ఇంకా ప్రారంభం కావడంతో ఆమె ఇంకా ఖాళీగానే ఇంట్లో ఉంటోందని మరికొందరు అంటున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షోకి డేట్లు కేటాయిస్తే బాగుంటుంది కదా అని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఏదేమైనా అనసూయ మాత్రం ఎప్పుడూ అటు బుల్లితెరపై కానీ, ఇటు బిగ్ స్క్రీన్ పై కానీ కనిపిస్తూనే ఉండాలని, లేకపోతే ఫ్యాన్స్ బాధపడతామని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -