Anasuya: అనసూయ పెడుతున్న బూతుల వీడియోల వెనుక కథ ఇదే!

Anasuya: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అప్పుడప్పుడు తన వ్యవహార శైలిపై సెటైరికల్ గా స్పందిస్తారు నెటిజన్లు. దీనికి ఆమె ఘాటుగానే రిప్లై ఇస్తారు. బుల్లితెర షోలలో ఆమె స్కిన్ షో చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గలేదు. నా బట్టలు నా ఇష్టం. నేను ఎలాంటి దుస్తులు దరించాలో చెప్పడానికి మీరెవరు. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా ధరిస్తా.. అంటూ అనసూయ కౌంటర్లు ఇచ్చారు.

 

ఆ మధ్య సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అనసూయ అందంగా ఉంటుంది. ఆమె కురచ దుస్తులు వేయాల్సిన అవసరం లేదని కామెంట్ చేశాడు. సీనియర్ నటుడని కూడా చూడకుండా కోటాకు అనసూయ ఇచ్చిపడేసింది. పరుష పదజాలంతో ఆయనపై విరుచుకుపడింది. ఆడవాళ్లపై మీ పరిమితులు ఏంటి మమల్ని జడ్జి చేయడానికి మీరెవరు అని ప్రశ్నించింది. తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఇదే విషయం ప్రస్తావిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. మహిళలు పిల్లల్ని కనమని కనొద్దని జాబ్ చేయాలని చెయ్యొద్దని లావుగా ఉండాలని కాదు బక్కగా ఉండాలని జడ్జి చేయబడుతున్నారు అంటూ అసహనం తెలియజేస్తున్న ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందులో బూతులు కూడా ఉన్నాయి.

ఇటీవల అనసూయపై సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. దీనిపై అనసూయ యుద్ధమే చేస్తున్నారు. మితిమీరి ప్రవర్తించిన వారిమీద చర్యలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి మీద ఫిర్యాదు చేసి జైలుపాలు చేసింది. నెటిజన్స్ కామెంట్స్ ని సాధారణంగా సెలెబ్రిటీలు పట్టించుకోరు. అనసూయ మాత్రం రియాక్ట్ అవుతుంది. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -