Anasuya: నెటిజన్ కు చుక్కలు చూపించిన అనసూయ.. ఆ ఒక్క కామెంట్ తో?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెరపై వరుస సినిమా అవకాశాలు అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో కారణంగా తీవ్రస్థాయిలో ట్రోల్ అవుతున్నారు. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ప్రియాంక చోప్రా స్త్రీ పురుష సమానత్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని అనసూయ షేర్ చేస్తూ… నా ఉద్దేశం కూడా ఇదే ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకొని ఒక టీం లాగా పనిచేయడం ఎంతో అవసరం.అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు ఒకవేళ కనిపించిన వారి గురించి దారుణమైన ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది పిల్లలకు కూడా ఇదే విషయాలు నేర్పించాలని ఈమె తెలియజేశారు.

 

అనసూయ చేసిన ఈ పోస్ట్ పై ఒక నెటిజన్స్ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ విషయంపై స్పందించిన నేటిజన్ మేడం మీరు ఇప్పటి నుంచే మీ పిల్లలకు వంట ఎలా చేయాలో నేర్పించండి. ఎందుకంటే వచ్చే భార్య సంపాదిస్తుంది కనుక వారికి వంట పని ఇంటిని ఎలా చక్క పెట్టాలో నేర్పించండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన అనసూయ కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 

తప్పకుండా నేర్పిస్తాను 11 సంవత్సరాల వయసున్న మా అబ్బాయి ఇప్పటికి నాకు కిచెన్లో చాలా హెల్ప్ చేస్తాడు.ఇంటి పనులే కాదు కుటుంబాన్ని పోషించడం కూడా నా పిల్లలకు ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను తను తనకు కాబోయే భార్య ఎలా జీవించాలి అనేది నేను మీరు నిర్ణయించలేము.ఎందుకంటే వాళ్ల జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. అందరూ జోక్యం చేసుకోవడానికి లేదు. ఇదే అందరితో వచ్చిన సమస్య ముందు మీ పని మీరు చూసుకోండి అంటూ ఈమె ఫైర్ అయ్యారు దీంతో నేటిజన్ ఒకసారిగా ట్వీట్ డిలీట్ చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -