Anasuya: వామ్మో.. యాంకర్ అనసూయ ఆస్తుల విలువ అన్ని రూ.కోట్లా?

Anasuya: తెలుగులో బాగా పాపులర్ అయిన యాంకర్ల జాబితాలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. హాట్ యాంకర్ గా, వివాదాలకు కేరాఫ్ గా ఉండే అనసూయ.. తెలుగులో కొన్ని టీవీ ఛానల్స్ లో పలు ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తోంది. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ.. తన అందంతో పాటు చలాకీతనంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

 

బుల్లితెర మీద తన చరిష్మాను చాటిన అనసూయ.. తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరిసింది. తెలుగులో క్షణం, కథనం, రంగస్థలం, పుష్ప, ఖిలాడీ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన యాంకర్ అనసూయ.. పలు సినీ ఇండస్ట్రీ కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటుంది.

 

తాాజాగా అనసూయ ఆస్తులకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ చేసే సమయంలో.. అనసూయ తెచ్చుకున్న ఆడి కార్ మీద కమెడియన్లు పంచులు వేయడం కూడా తెలిసిందే. అనసూయకు రూ.8కోట్ల విలువైన ఇల్లు ఒకటి జూబ్లిహిల్స లో ఉందని, రూ.2.50కోట్ల విలువైన రెండు కార్లు ఉన్నట్లు సమాచారం.

 

యాంకర్ అనసూయకు మొత్తంగా రూ.25కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. యాంకర్ అనసూయ షోలు, సినిమాలు, యాడ్స్ తో కలిసి ఏడాదికి రూ.2కోట్ల నుండి రూ.3కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. మొత్తానికి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ.. బాగానే ఆస్తులను సంపాదించినట్లు నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -