Sreemukhi: అవినాష్ పరువు తీసిన యాంకర్ శ్రీముఖి.. ఏమైందంటే?

Sreemukhi: బుల్లితెరపై బోల్డ్ బ్యూటీగా శ్రీముఖి దూసుకెళ్తోంది. ఏ ఛానెల్ చూసినా ఏ షో చేసినా కూడా అందులో శ్రీముఖి ఉంటోంది. ఆడియన్స్ కు నిత్యం ఆమె టచ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన షోల ద్వారా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి నిత్యం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటోంది. అదే టైంలో శ్రీముఖి తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా యాంకర్ శ్రీముఖి ఓ షోలో ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్‌ను వింత ప్రశ్న అడిగి షాక్ ఇచ్చింది.

 

ప్రస్తుతం యాంకర్ శ్రీముఖికి చేతినిండా షోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘జాతి రత్నాలు’, ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘సారంగ దరియా’, ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘బీబీ జోడీ’ వంటి షోలు చేస్తూ రెండు చేతులారా డబ్బులు సంపాదిస్తోంది. అదేవిధంగా కొన్ని సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ కనిపిస్తూ వస్తోంది.

 

తాజాగా శ్రీముఖి స్టార్ మా ఛానెల్‌లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో చేస్తుంగా ఆ షోకు చాలా మంది సీరియల్ నటులు గెస్టులుగా వస్తారు. ఈ షోలో శ్రీముఖితో పాటు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా సందడి చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒక రేంజ్ లో దూసుకుపోతుంటారు. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో భాగంగా ముక్కు అవినాష్ కొందరు నటీమణులను ఎత్తుకుని గాల్లో తిప్పుడూ ముగ్గురు బ్యూటీలతో ఓ ఆట ఆడుకున్నాడు.

 

ఆ టైంలో ఒకరిని ఎత్తుకునే సమయంలో పట్టుతప్పి కింద పడిపోయింది. అయినా కూడా అవినాష్ మళ్లీ ప్రయత్నించాడు. అమ్మాయిలను ఎత్తుకున్న అవినాష్ దగ్గరకు వచ్చిన యాంకర్ శ్రీముఖి ‘నిన్ను పర్సనల్‌గా ఒక క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పు అని అడిగింది. పెళ్లైన తర్వాత మీ ఆవిడ అనూజాను ఎన్నిసార్లు ఎత్తుకుని ఉంటావో నిజం చెప్పు అని ప్రశ్నించింది. శ్రీముఖి ప్రశ్నకు అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -