Sreemukhi: యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. కాబోయే మొగుడు అతనే!

Sreemukhi: తెలుగు బుల్లితెర మీద చాలామంది యాంకర్లు తమ హవాను కొనసాగిస్తున్నారు. అయితే యంగ్ యాంకర్ల జాబితాలో మాత్రం యాంకర్ శ్రీముఖి టాప్ లో ఉంటుంది. తెలుగులో బాగా ఫేమస్ అయిన యాంకర్లు సుమ, అనసూయలు కాకుండా ఎక్కువగా పాపులర్ అయిన యాంకర్ గా శ్రీముఖి ఇప్పుడు హవాను కొనసాగిస్తోంది. బుల్లితెర, వెండి తెర, ఓటీటీ ఇలా అన్నింటా తన హవాను శ్రీముఖి కొనసాగిస్తోంది.

 

‘పటాస్’ షోతో యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి.. తనదైన స్టైల్, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల్లో రాములమ్మగా కూడా శ్రీముఖి మంచి గుర్తింపు సాధించింది. అయితే జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్, బీబీ జోడి లాంటి షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీముఖి.. ఇటీవలే సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించింది.

 

శ్రీముఖి బుల్లితెర మీద తన హవాను కొనసాగిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా వెండి తెర మీద కనువిందు చేస్తోంది. కాగా ఈ ఏడాదిలో 30 ఏళ్లలోకి అడుగుపెట్టనున్న శ్రీముఖి.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ తో ఇప్పటికే రిలేషన్ లో ఉన్న శ్రీముఖి.. ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

శ్రీముఖి తన వ్యవహారాన్ని ఇంట్లో కూడా చెప్పేసిందని.. సదరు బిజినెస్ మ్యాన్ కుటుంబం, శ్రీముఖి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది శ్రీముఖికి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అప్పుడే సన్నాహాల్లో కూడా మునిగిపోయారట. పెళ్లి కార్యక్రమాలను ఎలా, ఎప్పుడు జరపాలనే దానిపై అప్పుడే చర్చ కూడా మొదలుపెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -