Suma Kanakala: 1999లో సుమ రేంజ్ ఇదే.. పెళ్లిచీర ఎంతంటే?

Suma Kanakala: బుల్లితెర యాంకర్ సుమ హవా గతంతో పోలిస్తే బుల్లితెరపై కొంతమేర తగ్గిందనే సంగతి తెలిసిందే. అయితే పెద్ద హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాత్రం ఇప్పటికీ సుమ మాత్రమే యాంకర్ గా కొనసాగుతున్నారు. సుమ రేంజ్ లో హోస్ట్ చేసే మరో యాంకర్ లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా సుమ తన పెళ్లి చీర ఖరీదును రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు. కొన్ని నెలల క్రితం సుమ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారనే సంగతి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమ వేర్వేరు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సుమ ఒక స్పెషల్ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకోవడంతో పాటు తన పెళ్లి రోజులను గుర్తు చేసుకోవడం గమనార్హం.

సుమ తల్లితో కలిసి షాపింగ్ కు వెళ్లగా సేల్స్ మాన్ ఈ చీరల ఖరీదు కేవలం 15,000 రూపాయలు అని మీ రేంజ్ చీరలు పై ఫ్లోర్ లో ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత సుమ ఒక చీర ఎంతగానో నచ్చడంతో ధర ఎంతని అడగగా సేల్స్ మాన్ ఆ చీర ఖరీదు 2,00,000 రూపాయలు అని చెప్పారు. ఆ తర్వాత సుమ తాను ఇప్పటివరకు ఇంత ఖరీదైన చీరను కట్టలేదని నా పెళ్లి చీర ఖరీదు 11,000 రూపాయలు అని తెలిపారు.

సుమ తన పెళ్లి చీర ఖరీదును వెల్లడించడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 1999 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీన సుమ రాజీవ్ ల వివాహం జరిగింది. సుమ బుల్లితెరకే ఎక్కువగా పరిమితమైనా ఆమె సంపాదన ఊహించని రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుమ రాజీవ్ ల కొడుకు త్వరలో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 1999లో 11,000 రూపాయల చీర అంటే ఖరీదు ఎక్కువని కొంతమంది చెబుతుంటే సుమ రేంజ్ కు ఆ మొత్తం తక్కువేనని మరికొందరు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -