Anchor Varshini: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్.. వరుడు ఎవరో కాదు!

Anchor Varshini: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెర యాంకర్ గా అడుగు పెట్టి తన చక్కటి అందంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ పేరుకు యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్లకు ఉండే క్రేజ్ తాను సొంతం చేసుకుంది అంటే నిజమని చెప్పవచ్చు.

ఎందుకంటే కుర్రకారుని తన అందం, ఒంపుసొంపులతో ఒక రేంజ్ లో ఫిదా చేసింది వర్షిణి. ఈ ఫాలోయింగ్ తో పలు సినిమాల్లో కూడా నటించింది వర్షిణి కానీ ఆ సినిమాలు ఆమెకి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. కాగా ఈ అమ్మడు అప్పటినుంచి సోషల్ మీడియాని ఆయుధంగా మార్చు కోవాలని చూసింది. తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో సన్నని నడుముతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది ఈ అమ్మడు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ అటు వెండితెరపై, ఇటు బుల్లితెరకు దూరమైంది. గత కొంతకాలంగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే వర్షిణి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే త్వరలో ఈ అమ్మడు ఒక పెద్దింటి కోడలు కాబోతుందట. అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు దూరమైన ఈమె పెళ్లి చేసుకోని సెటిలవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇంతకు వర్షిణి చేసుకునే అబ్బాయి ఎవరంటే? ఆమెకు సొంత బావ అని తెలుస్తుంది. ఈమెకి చిన్నప్పటినుంచి తన బావ అంటే చాలా ఇష్టమట. ఇక తన బావకు కూడా వర్షిణి అంటే ఇష్టమట. కానీ సినిమా అవకాశాలు వస్తాయేమో అని ఇన్ని రోజులు కుటుంబ సభ్యులు వర్షిణి పెళ్లి విషయంలో ఎప్పుడు ప్రస్థావించ లేదట. ఇక ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చి వర్షిణికి పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కి సంబంధించిన పెళ్లి వార్త మాత్రం సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -