Andaru Bagundali Andulo Nenundali Review: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా రివ్యూ & రేటింగ్!

విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022

నటీనటులు : అలీ, నరేష్, పవిత్ర లోకేశ్, మౌర్యానా

నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : కొనతాల మోహన్

దర్శకత్వం : శ్రీపురం కిరణ్‌

సంగీతం : రాకేశ్‌ పళిడమ్‌

ఎడిటర్ : సెల్వకుమార్‌

సినిమాటోగ్రాఫర్ : ఎస్‌. మురళి మోహన్‌ రెడ్డి

Andaru Bagundali Andulo Nenundali Review and Rating

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. అలీ పలు సినిమాలలో హీరోగా నటించగా ఆ సినిమాలు సైతం సక్సెస్ సాధించాయి. పూరీ జగన్నాథ్ సినిమాలతో కమెడియన్ గా కూడా ఈ మధ్య కాలంలో విజయాలు అందుకున్న అలీ లీడ్ రోల్ లో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీలో నటించారు. ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ: శ్రీనివాసరావు(సీనియర్ నరేష్), సునీత(పవిత్ర లోకేశ్) సంతోషంగా జీవనం సాగిస్తూ ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకుంటూ అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకుంటారు. వయస్సు పెరుగుతున్నా ఒకరిపై మరొకరికి ప్రేమ మాత్రం తగ్గదు. అయితే ఆదర్శ దంపతులుగా ఉన్న వీళ్లిద్దరి మధ్య మహమ్మద్ సమీర్(అలీ) తీసిన ఒక ఫోటో వల్ల సమస్యలు మొదలవుతాయి. వేరే దేశం నుండి ఇండియాకు వచ్చిన మహమ్మద్ సమీర్ కు సెల్ఫీలు తీసుకోవడం అంటే ఇష్టం కాగా ఆ ఇష్టం వల్ల మహమ్మద్ సమీర్ కూడా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు.

మహమ్మద్ సమీర్ కు ఎదురైన ఇబ్బంది ఏమిటి? సమీర్ తను చిక్కుకున్న సమస్య నుంచి బయటపడ్డాడా? దిల్ రుబా(మౌర్యాని)తో సమీర్ ప్రేమకథ ఎలా మొదలైంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

విశ్లేషణ : పరిమిత సంఖ్యలో పాత్రలతో తెరకెక్కినా సినిమా ఆకట్టుకునేలా ఉండటంతో ఓటీటీలో ఈ వారం మంచి సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. దర్శకుడు రియల్ లైఫ్ లోని పాత్రల స్పూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

మలయాళంలో హిట్ గా నిలిచిన వికృతి మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కినా ఈ సినిమా రీమేక్ అనే భావన ఎక్కడా కలగదు. నరేష్, పవిత్రా లోకేశ్ జోడీ తమ పాత్రల్లో జీవించేశారనే చెప్పాలి. రియల్ లైఫ్ లో వాళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల రీల్ లైఫ్ లో కూడా నరేష్ పవిత్ర లోకేశ్ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సోషల్ మీడియా ద్వారా మనుషులకు ఎదురవుతున్న సమస్యలను అందరికీ అర్థమయ్యేలా ఈ సినిమాలో చక్కగా వివరించారు.

సింగర్ మనో పాత్ర పరిమితమే అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్న ట్విస్టులు తక్కువే అయినా ఆ ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు శ్రీపురం కిరణ్‌ తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ సినిమాతో ఆయన ఖాతాలో సక్సెస్ చేరినట్టేనని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండి ఉంటే బాగుండేది. రాకేశ్‌ పళిడమ్‌ మ్యూజిక్ రొటీన్ గా ఉంది. బీజీఎం విషయంలో రాకేశ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్

అలీ, పవిత్ర లోకేశ్, నరేష్ నటన

ఎమోషనల్ సీన్స్

కథ, కథనం

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

మ్యూజిక్

ఎడిటింగ్

రేటింగ్ : 3/5

బాటమ్ లైన్ : ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే ఎమోషనల్ డ్రామా

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -