CM Jagan: డీలా పడిపోయిన జగన్.. పరాజయం తప్పదని తేల్చేసిన సర్వేలు.. ఈసారి కష్టమేనా?

CM Jagan: 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీలలోనూ ఎలాగైనా గెలవాలి అనే ఆత్రుత కనబడుతోంది కానీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా డీలా పడిపోయిందని తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో 175 స్థానాలు గెలుపొందాలి అన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఓటమి భయం పట్టుకుందని తెలుస్తుంది.

సొంత సర్వేలు పలు కీలకమైన సర్వేలలో కూడా వైసిపికి ఓటమి తప్పదు అనే ఫలితాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ పార్టీని వదిలి పక్క పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు కొత్త వారిని ఇన్చార్జిలుగా వ్యవహరించారు. వారు కూడా ఇంకా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టలేదు.

ఇక గతంలో పోటీ చేసిన కొందరు అదే స్థానాలలో పోటీ చేస్తే ఓడిపోతారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వారిని స్థాన బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. ఇక టికెట్ ఇవ్వనివారు బయట ఉన్న పరిస్థితులు చూసి అలాగే సర్వే ఫలితాలను చూసి మనకు టికెట్ లేకపోవడమే మంచిదని భావిస్తున్నటువంటి పరిస్థితులు వైసీపీ పార్టీకి ఏర్పడ్డాయి.

ఇలా ఎటు వైపు నుంచి చూసిన వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి గద్దె దిగడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కేవలం 65 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు కానీ తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలోనే 99 మంది అభ్యర్థులను ప్రకటించారు ఇలా ప్రకటించిన వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రచార పనులను ప్రారంభించగా వైసిపి నేతలు మాత్రం తమకు టికెట్ వస్తుందా రాదా అనే కంగారులో కొందరు ఉండగా వచ్చినా కూడా ప్రచార కార్యక్రమాలకు వెళ్లకుండా మరికొందరు మౌనం వహిస్తున్నారు. ఇలా వైసిపి నేతలందరూ మౌనంగా ఉండడానికి కారణం వారిని ఓటమి భయం వెంటాడటమేనని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -